అందుకే అలాంటి రిస్క్ తీసుకోవడానికి భయపడను : కాజల్

కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో దశాబ్దానికి పైగా మెరుపులు మెరిపిస్తున్న భామ. నిజం చెప్పాలంటే ఈ బ్యూటీకి ‘నేనే రాజు నేనే మంత్రి’ తర్వాత ఏ భాషలోనూ హిట్‌ లేదు. అందుకే రిస్క్ తీసుకోవడానికి వెనకాడటం లేదని చెప్పుకొచ్చింది.

news18-telugu
Updated: January 23, 2020, 1:19 PM IST
అందుకే అలాంటి రిస్క్ తీసుకోవడానికి భయపడను : కాజల్
కాజల్ అగర్వాల్ (Instagram/kajalaggarwalofficial)
  • Share this:
కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో దశాబ్దానికి పైగా మెరుపులు మెరిపిస్తున్న భామ. నిజం చెప్పాలంటే ఈ బ్యూటీకి ‘నేనే రాజు నేనే మంత్రి’ తర్వాత ఏ భాషలోనూ హిట్‌ లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘సీత’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇక  కాజల్ నటించిన ‘ప్యారిస్ ప్యారిస్’ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు కమల్ హాసన్ హీరోగా నటిస్తోన్న ‘భారతీయుడు 2’లో 85 ఏళ్ల ముసలమ్మ పాత్రలో నటిస్తోంది. వాటితో పాటు బాలీవుడ్‌లో ‘ముంబాయి సాగా’ సినిమా చేస్తోంది. వీటిపైనే కాజల్ ఆశలన్ని.  ఈ చిత్రాల్ని ఎపుడో రెండేళ్ల క్రితం కాజల్ ఒప్పుకున్నవి. ఈ మధ్యలో ఈ భామ ఏ సినిమాకు సైన్ చేయలేదు. ఈ సినిమాల తర్వాత అవకాశాల కోసం  తనకు తెలిసిన అన్నిమార్గాలలోనూ ప్రయత్నాలు తీవ్రం చేస్తోంది కాజల్. ఇందులో భాగంగా తక్కువ పారితోషికంతోనే నటిస్తాను అనే ఆఫర్‌ కూడా ఇచ్చింది. సినిమాలు తగ్గుముఖం పట్టడంతో వెబ్‌ సీరీస్‌పై దృష్టి సారించింది. ఇప్పటికే నవతరం హీరోలతో నటించడానికి కూడా ఓకే చెప్పేస్తోంది ఈ చందమామ. తాజాగా ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూ లో "తాను సినిమాకు పరిచయమైన కొత్తలో పరిస్థితి వేరు. ఇపుడున్న పరిస్థితులు వేరని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను నటిగా చాలా పరిణితి చెందానని చెప్పుకొచ్చింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రిస్క్‌ తీసుకోవడానికి భయపడనని చెప్పింది.

Kajal Aggarwal Wedding, Taj Mahal, marriage plan,kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal prabhas love story,kajal aggarwal marriage with businessman,kajal aggarwal marriage,kajal aggarwal marriage photos,kajal agarwal married,kajal agarwal marriage fixed,kajal aggarwal twitter,kajal agarwal marriage photos family,kajal aggarwal instagram,kajal aggarwal movies,kajal aggarwal photos,telugu cinema,కాజల్ అగర్వాల్ పెళ్లి,కాజల్ అగర్వాల్ పెళ్లి ముచ్చట్లు,కాజల్ పెళ్లి,కాజల్ అగర్వాల్,బిజినెస్ మ్యాన్‌తో కాజల్ పెళ్లి,కాజల్ బెల్లంకొండ శ్రీనివాస్,కాజల్ అగర్వాల్ ప్రియుడు,కాజల్ అగర్వాల్ ప్రేమ,తెలుగు సినిమా
కాజల్ అగర్వాల్ (credit - insta - kajalaggarwalofficial)


అందుకే ప్రయోగాత్మక పాత్రల్లో నటించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఇంకా కథలో తన పాత్ర బాగుంటే కొత్తనటులతో జత కట్టడానికి కూడా రెడీ అని తెలిపింది. ప్రస్తుతం తనకు తగ్గుతున్న అవకాశాల గురించి మాట్లాడుతూ ప్రస్తుతం తనకు రెస్ట్ లేకపోవడం వల్లనే సినిమాలు ఒప్పుకోవడం లేదని.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాక మళ్లీ సినిమాలు చేస్తానని కవరింగ్ ఇస్తుంది. ఈ ఏడాది తన నట జీవితం ఇంకా విజయవంతంగా ఉంటుందనే విశ్వాసాన్ని నటి కాజల్‌ అగర్వాల్‌ ఆశా భావం వ్యక్తం చేసింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 23, 2020, 1:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading