కాజల్ అగర్వాల్‌కు వెంట్రుక వాసిలో తప్పిన ప్రమాదం..

india 2 accident | తెలుగు, తమిళంలో పాటు సౌతిండియాలో టాప్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఉన్న కాజల్ అగర్వాల్‌కు తృటిలో ప్రమాదం తప్పింది.

news18-telugu
Updated: February 20, 2020, 10:59 AM IST
కాజల్ అగర్వాల్‌కు వెంట్రుక వాసిలో తప్పిన ప్రమాదం..
కాజల్ అగర్వాల్ (Twitter/Photo)
  • Share this:
తెలుగు, తమిళంలో పాటు సౌతిండియాలో టాప్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఉన్న కాజల్ అగర్వాల్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె హీరోయిన్‌గా శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తోన్న భారతీయుడు 2 సెట్లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే కదా. షూటింగ్ కోసం ఏర్పాటు చేసుకున్న ప్రమాదవశాత్తు కూలడంతో భారతీయుడు 2 సినిమా కోసం పనిచేస్తోన్న ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనలో దర్శకుడు శంకర్ కూడా గాయాలపాలయ్యాడు. అంతేకాదు మరో 10 మంది తీవ్ర గాయాలతో బయట పడ్డారు. గాయపడిని వారిని దగ్గరలో గత ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ యాక్సిడెంట్ స్పాట్‌‌లో కాజల్ అగర్వాల్ అక్కడే ఉందట. తృటిలో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డానని కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికా ప్రకటించింది.


ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాల బాధ వర్ణణాతీతం. ఇలా జరుగుతుందని అనుకోలేదు. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను. భారతీయుడు 2 షూటింగ్ స్పాట్‌లో క్రేన్ 150 అడుగుల ఎత్తున క్రేన్ తెగపడి అక్కడే ఉన్న టెంట్ పై పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఓ లైట్ బాయ్ అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనపై తమిళ, తెలుగు సినీ పరిశ్రమలతో పాటు యావత్ సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. భారతీయుడు 2 సినిమాలో కాజల్ అగర్వాల్‌తో పాటు రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే యేడాది విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.First published: February 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు