Kajal Aggarwal : కాజల్ అగర్వాల్.. దాదాపు ఓ దశాబ్దం కాలంగా తెలుగువారిని తన అందచందాలతో అలరిస్తూనే ఉంది. అంతేకాకుండా స్టార్ హీరోయిన్‌గా కూడా గుర్తింపు పొంది ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటూ తమిళ్, హిందీ సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తేజ 'లక్ష్మీ కళ్యాణం'తో టాలీవుడ్‌కు పరిచయమైనా.. కృష్ణ వంశీ 'చందమామ' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. అయితే కేరిర్ మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన కొంత ఇండస్ట్రీలో కుదురుకున్న తర్వాత నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తూ తనకంటూ సొంత అభిమానుల్ని సంపాదించుకుంది కాజల్. అది అలా ఉంటే.. ఇటీవల మీడియాతో మాట్లాడిన కాజల్ రెబల్ స్టార్ ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే..
View this post on Instagram
ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'సాహో' తెలిసిందే. ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను యువ దర్శకుడు సుజిత్ డైరెక్ట్ చేశాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ 'సాహో' చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని అలరించలేకపోయింది. కానీ.. హిందీలో మాత్రం మంచి విజయం సాధించింది. తెలుగులోనే బయ్యర్లు కొంత నష్టాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అది అలా ఉంటే.. సాహోలో అదిరిపోయే ఓ ఐటమ్ నెంబర్ వున్న విషయం తెలిసిందే. అయితే ఈ పాటను అందాల చందమామ కాజల్‌తో ప్లాన్ చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కాగా.. తనను కాదని.. హిందీ భామ జాక్వెలిన్‌ను ఆ పాటకోసం తీసుకోవడంతో కాజల్ ప్రభాస్‌పై అలిగినట్లు కూడా ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ అలాంటిదేమి లేదని తేల్చేసింది. అంతేకాదు ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. హాలీవుడ్ సూపర్ హీరోస్, మార్వెల్ క్యారెక్టర్స్ ఐరన్ మ్యాన్, హల్క్ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుందో ప్రభాస్ అలా ఉంటాడంటూ.. ప్రభాస్‌ను ప్రశంసించింది. ప్రభాస్, కాజల్ అగర్వాల్ గతంలో 'డార్లింగ్', 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాల్లో నటించి అదరగొట్టిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kajal Aggarwal, Prabhas Latest News, Saaho movie, Telugu Movie News