‘సైరా నరసింహారెడ్డి ’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో' ఆచార్య' పేరుతో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఆచార్యను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. సామాజిక కోణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి లుక్ కూడా ఆసక్తిగొలిపేలా ఉంది. అది అలా ఉంటే మొన్నటి వరకు ఈ సినిమాలో మహేష్ బాబు ఓ పాత్రలో నటించనున్నాడు అని ఓ ప్రచారం జరిగింది. కానీ క్రియేటివ్ డిఫరెన్స్‌ల కారణంగా ఆయన ఆ సినిమా నుండి తప్పుకున్నట్టు సమాచారం. దీంతో రామ్ చరణ్ ఆ పాత్రలో మెరవనున్నాడని సమాచారం. అంతేకాదు ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటించే అవకాశాలున్నాయి. మరోవైపు ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ గా త్రిష నటించాల్సివుండగా కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్‌సెస్ వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ధృవీకరించింది.

చిరంజీవి కాజల్ అగర్వాల్
ఉన్నట్టుండి త్రిష ఆచార్య సినిమా నుండి తప్పుకోవడంతో ఆమె స్థానంలో హీరోయిన్గా అనుష్కను అనుకున్నారు. కానీ అనుష్క ఈ ప్రాజెక్ట్ చేయడానికి నో చెప్పింది. దాంతో చిత్ర యూనిట్ కాజల్ అగర్వాల్‌ను సంప్రదించింది. తాజాగా చిత్రంలో నటించే విషయమై కాజల్ అగర్వాల్ స్పందించింది. తాజాగా ఓ నెటిజన్ మీరు నటించే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటి ? అడిగిన ప్రశ్నకు కాజల్ అగర్వాల్ ఆసక్తికర సమాధానమిచ్చింది. కమల్ హాసన్‌తో, బాలీవుడ్ సినిమాతో పాటు చిరంజీవి, కొరటాల శివ సినిమాలో యాక్ట్ చేయనున్నట్టు సమాధానమిచ్చింది. గతంలో కాజల్ అగర్వాల్.. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ నటించిన సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంలో చిరంజీవి ఈ అమ్మడి కుమ్ముడుకు ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. ఇపుడు కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే చిత్రంలో మరోసారి ఎలా చేస్తుందో చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:March 23, 2020, 14:26 IST