జూనియర్ ఎన్టీఆర్ కాజల్ అగర్వాల్ (jr ntr kajal aggarwal)
అదేంటి.. అంత చక్కగా నందమూరి తారక రామారావు అనే పేరున్నపుడు మరో పేరు పెట్టాల్సిన అవసరం ఏంటి.. ఇంతకీ ఏం పేరు పెట్టింది అనుకుంటున్నారా..? తారక్ పుట్టిన రోజు మరో 10 రోజులు ఉండగానే తన బర్త్ డే కోసం వేచి చూస్తున్నట్లు ట్వీట్ చేసాడు కాజల్. ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి బృందావనం, బాద్షా, టెంపర్ సినిమాలు చేసారు. ఇక జనతా గ్యారేజ్‌లో ఐటం సాంగ్ కూడా చేసింది. ఈ పాట కూడా కేవలం ఎన్టీఆర్‌తో ఉన్న స్నేహం కారణంగానే చేసింది కాజల్ అగర్వాల్. సినిమాల్లోనే కాదు బయట కూడా ఈ ఇద్దరి స్నేహం ఇలాగే ఉంటుంది.

జూనియర్ ఎన్టీఆర్ కాజల్ అగర్వాల్ (jr ntr kajal aggarwal)
కాజల్ హైదరాబాద్ వచ్చినపుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి కూడా వెళ్తుంది. అక్కడ పిల్లలతో ఆడుకుంటుంది. అలాంటి కాజల్ ఇప్పుడు జూనియర్ బర్త్ డే కోసం చూస్తుంది. ఆమె మాత్రమే కాదు.. అభిమానులు కూడా మే 20 కోసం చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆ రోజు వస్తుందా అని వేచి చూస్తున్నారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ టీజర్ ఏదైనా వస్తుందేమో అని ఆశ పడుతున్నారు. ఇదిలా ఉంటే కాజల్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌కు అడ్వాన్స్ బర్త్ డే విషెస్ చెబుతూనే తారక్‌కు తరామీ అనే కొత్త పేరు పెట్టింది.
అందులో చాలా అర్థం ఉంది. తరామీ అంటే తారక్ సునామీ అనే అర్థం అంట. అది కూడా కాజలే చెప్పింది. తనకు జూనియర్ ఎన్టీఆర్‌లో ఓ సునామి కనిపిస్తుందని చెప్పుకొచ్చింది కాజల్. అందుకే జూనియర్‌ను తారక్ కంటే తరామీ అనడం కరెక్ట్ అంటుంది ఈ ముద్దుగుమ్మ. తారక్ సునామీ.. ఈ పేరేదో బాగుందని ఎన్టీఆర్ అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు. ఈ ఏడాది అద్భుతంగా ఉండాలంటూ కోరింది కాజల్ అగర్వాల్. అయితే ఉన్నట్లుండి ఎన్టీఆర్‌ను కాకా పట్టడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటో మాత్రం అభిమానులకు అర్థం కావడం లేదు.
Published by:
Praveen Kumar Vadla
First published:
May 9, 2020, 5:21 PM IST