Kajal Aggarwal: బాలీవుడ్ పై కాజల్ దండయాత్ర .. ఈసారైనా ఫలిస్తుందా..

అసలు కాజల్ అగర్వాల్  వెండితెరకు పరిచయమైంది హిందీ చిత్రం  ద్వారానే.. అయినా, కాజల్ కు గుర్తింపు వచ్చింది మాత్రం దక్షిణాదిలో..అందునా తెలుగులో  కాజల్ అగర్వాల్‌కు స్టార్ హీరోయిన్స్ జాబితాలోకి ఎక్కింది.

news18-telugu
Updated: September 18, 2019, 3:24 PM IST
Kajal Aggarwal: బాలీవుడ్ పై కాజల్ దండయాత్ర .. ఈసారైనా ఫలిస్తుందా..
కాజల్ అగర్వాల్ (Instagram/Twitter)
  • Share this:
అసలు కాజల్ అగర్వాల్  వెండితెరకు పరిచయమైంది హిందీ చిత్రం  ద్వారానే.. అయినా, కాజల్ కు గుర్తింపు వచ్చింది మాత్రం దక్షిణాదిలో..అందునా తెలుగులో  కాజల్ అగర్వాల్‌కు స్టార్ హీరోయిన్స్ జాబితాలోకి ఎక్కింది. ప్రస్తుతం ఈమె హిందీలో హవా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. 2004లో వివేక్‌ ఒబెరాయ్‌- ఐశ్వర్యారాయ్‌ జంటగా ‘క్యూ హో గయా నా’ చిత్రంలో ఐశ్వర్య స్నేహితురాలిగా చిన్న పాత్రలో కనిపించింది కాజల్‌ అగర్వాల్‌. ఆపై దక్షిణాదిలో ప్రవేశించింది.దక్షిణాదిన తెలుగు, తమిళ భాషల్లో పెద్ద కథానాయికగా ఎదిగిన కాజల్ అగర్వాల్.. అప్పుడప్పుడూ బాలీవుడ్ బాట పడుతూనే ఉంది. కానీ ఆమెకు హిట్ వస్తే పేరు రావట్లేదు. పేరొస్తే హిట్ పడట్లేదు. చాలా ఏళ్ల కిందట ఆమె ‘స్పెషల్ చబ్బీస్’, ‘సింగం’ సినిమాల్లో కథానాయికగా నటించింది. ఆ రెండూ హిట్టయ్యాయి. కానీ వాటిలో కాజల్‌ది చాల చిన్న పాత్ర. ఆమెకు ఎలాంటి పేరూ రాలేదు.

కాజల్ అగర్వాల్ బాలీవుడ్ సినిమాలు సింగం,స్పెషల్ 26 (Twitter/Photo)


ప్రాంతీయ భాషల్లో ఎన్ని సినిమాలు చేసినా బాలీవుడ్‌లో నటిస్తే వచ్చే కిక్కేవేరు. అందుకే దక్షిణాదితో పాటు ఇతర భాషల్లో నటించే తారలందరూ హిందీలో సినిమా చేసే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుంటారు.ఉత్తరాది భామలు దక్షిణాదికి వచ్చి ఇక్కడ ఎన్ని హిట్లు అందుకున్నా.. ఎంత పెద్ద హీరోయిన్‌గా అయినా.. వాళ్ల మనసు బాలీవుడ్ మీద ఉంటుంది. తమ సొంత భాషలో సినిమాలు చేసి దేశవ్యాప్త గుర్తింపు పొందాలన్న ఆశ ఉంటుంది. ఈ దిశగా ఎంతోమంది ఉత్తరాది హీరోయిన్లు ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్లలో చాలా తక్కువమందే విజయవంతం అయ్యారు. ప్రస్తుతం కాజల్ అదేబాట పట్టింది.

కాజల్ అగర్వాల్ ‘దో లఫ్జోంకి కహాని’ (File Photo)


కొంచెం గ్యాప్ తీసుకుని ‘దో లఫ్జోంకి కహానీ’ అనే సినిమా చేసింది. రణదీప్ హుడా హీరో. ఇందులో హీరోహీరోయిన్లద్దరూ అంధులు. రణదీప్, కాజల్ ఇద్దరూ చక్కటి పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఐతే ఈసారి కాజల్‌కు పేరు మాత్రమే మిగిలింది. సక్సెస్ దక్కలేదు. దీంతో మళ్లీ నిరాశ తప్పలేదు. ఈ దెబ్బతో కాజల్ మళ్లీ హిందీ సినిమాల వైపు చూడలేదు. దక్షిణాది సినిమాల మీదే ఫోకస్ పెట్టింది. ఇక్కడ ఓ మోస్తరుగా కెరీర్ సాగిపోతుండగా.. ఇప్పుడు మళ్లీ హిందీ వైపు దృష్టిసారించింది.

Kajal Aggarwal re entry in bollywood and She will romance with John Abraham in Mumbai Saga movie pk కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సౌత్‌లో టాప్ హీరోయిన్. 30 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 2లో నటిస్తుంది చందమామ. kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal helo app,kajal aggarwal movies,kajal aggarwal indian 2,kajal aggarwal john abraham,kajal aggarwal mumbai saga movie,kajal aggarwal bollywood,kajal aggarwal hindi movies,kajal aggarwal mumbai saga movie,kajal aggarwal hot scenes,telugu cinema,కాజల్ అగర్వాల్,కాజల్ అగర్వాల్ జాన్ అబ్రహం,కాజల్ హిందీ సినిమాలు,కాజల్ ఇండియన్ 2,తెలుగు సినిమా
జాన్ అబ్రహం కాజల్ అగర్వాల్ (Source: Twitter)


ప్రస్తుతం కాజల్ అగర్వాల్.. జాన్ అబ్రహాం కొత్త సినిమా ‘ముంబయి సాగా’లో కథానాయికగా నటిస్తోంది. ఇందులో కాజల్  విభిన్నమైన పాత్ర పోషించనుందట. ఇందులో ఇమ్రాన్ హష్మి మరో హీరోగా నటిస్తున్నాడు. టెర్రరిజం నేపథ్యంలో సాగే ఈ సినిమాను ‘కాంటే’ ఫేమ్ సంజయ్ గుప్తా తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ చిత్రంలో అయినా కాజల్ దండయాత్ర ఫలించి ఆమెకు హిందీలో హిట్, పేరు రెండూ వస్తాయేమో చూడాలి.
First published: September 18, 2019, 3:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading