టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన బెస్ట్ ఫ్రెండ్ అర్జున్‌కు బెస్ట్ విషెస్ తెలియజేసింది. ఇంతకీ అర్జున్ అంటే ఎవరో కాదు మంచు విష్ణు. ఈ రోజు అతని బర్త్ డే. ఈ సందర్భంగా మంచు విష్ణు.. ‘మోసగాళ్లు’ అనే టైటిల్‌తో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాఫ్రీ గి చిన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా సరైన సక్సెస్ లేని మంచు విష్ణుకు ఈ సినిమా చాలా కీలకం అనే చెప్పాలి. ఈ సినిమాను తెలుగుతో పాటు ఇంగ్లీష్‌లో భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విష్ణు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుందా లేదా అనేది కన్ఫామ్ కాలేదు. కానీ కాజల్ అగర్వాల్.. మంచు విష్ణుకు బర్త్ డే విషెస్ చెప్పి ఈ సినిమాసై అందరి కళ్లు పడేలా చేసింది. మరి ‘మోసగాళ్లు’ మూవీతోనైనా హీరోగా మంచు విష్ణు సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనేది చూడాలి.
Happy birthday Arjun ! @iVishnuManchu #mossagallu @TheLeapMan pic.twitter.com/U5uc75Wdte
— Kajal Aggarwal (@MsKajalAggarwal) November 23, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kajal Aggarwal, Manchu Vishnu, Telugu Cinema, Tollywood