నేషనల్ అవార్డ్ పొందిన చిత్రం సీక్వెల్‌లో కాజల్...

Kajal Aggarwal : నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో 'అ' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.  పోయిన సంవత్సరం విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అంతేకాకుండా మేకప్‌, వీఎఫ్‌ఎక్స్‌ విభాగాల్లో ఈ సినిమాకు జాతీయ అవార్డ్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: August 18, 2019, 9:26 AM IST
నేషనల్ అవార్డ్ పొందిన చిత్రం సీక్వెల్‌లో కాజల్...
కాజల్ అగర్వాల్ Photo: Instagram
  • Share this:
Kajal Aggarwal : కాజల్ అగర్వాల్.. ఓ అందాల మెరుపుతీగ.  'చందమామ' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. అప్పటినుండి.. దాదాపు ఓ దశాబ్దం కాలంగా తెలుగువారిని తన అందచందాలతో అలరిస్తూనే ఉంది. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కాజల్.. కూడా ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటూ తమిళ్, హిందీ సినిమాలు కూడా చేస్తూ అదరగొడుతోంది. అయితే కేరిర్ మొదట్లో  గ్లామర్ పాత్రలకే పరిమితమైన కొంత కుదురుకున్న తర్వాత నటనకు ప్రాధాన్యమున్న సినిమాలతో అభిమానుల్ని సంపాదించుకుంది కాజల్. అందులో భాగంగా.. ఈ ముద్దుగుమ్మ ఆ మధ్య నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో 'అ' అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.  గతేడాది విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అంతేకాకుండా ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డ్‌ల్లో మేకప్‌, వీఎఫ్‌ఎక్స్‌ విభాగాలకు అవార్డ్స్ వచ్చిన సంగతి తెలిసిందే. 

View this post on Instagram
 

@misho_designs


A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

కాగా.. తాజాగా వస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాకి సీక్వెల్‌ని రూపొందించే పనిలో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఉన్నారని తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సీక్వెల్‌లో ఓ ముఖ్యపాత్రలో హీరోయిన్‌ కాజల్‌ను ఇప్పటికే ఎంపిక చేసిందట చిత్ర బృందం.  ఈ సినిమాలో కాజల్‌తో పాటు తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా మరో ముఖ్య పాత్రలో నటించనున్నట్టు టాక్. అయితే ఈసారి మాత్రం వినూత్న కథాంశంతో పాటు కొంత కమర్షియల్‌‌గా ఉండే విధంగా ప్రశాంత్‌ వర్మ ప్లాన్‌ చేస్తున్నారట.
First published: August 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>