kajal samantha: ఇద్దరు హీరోయిన్లు కలిసి నటించడం కొత్త విషయం ఏమి కాదు. నాటి నుంచి నేటి వరకు ఎన్నో సినిమాల్లో ఎంతోమంది హీరోయిన్లు కలిసి నటించిన సందర్భాలు ఉన్నాయ్. అయితే అలా కలిసి నటించడం ఒక ఎత్తైతే అలా నటించిన సినిమాలు అన్ని సూపర్ హిట్ అవ్వడం మరో ఎత్తు. అలా కాజల్, సమంత కలిసి నటించిన సినిమాలు భారీస్థాయిలో హిట్ అయ్యాయి. నిజానికి ఇద్దరు స్టార్ హీరోయిన్లు కలిసి నటించడం సాధారణ విషయం కాదు. అలాంటిది వీరు చిన్న పాత్ర అయిన.. స్పెషల్ సాంగ్ లో చెయ్యాల్సి వచ్చిన ఇద్దరు కలిసి నటించి ఎంతో మెప్పించారు.
అలా కాజల్, సమంత కలిసి ఎన్ని సినిమాల్లో నటించారో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం... క్యూట్ గా, హాట్ గా కనిపిస్తూ వారి నటనతో ఆకట్టుకున్న హీరోయిన్లు సమంత, కాజల్. అలాంటి వీరు 2010లో వంశి పైడిపల్లి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన బృందావనం సినిమాలో అక్క చెల్లెల్లా పాత్రల్లో నటించి సూపర్ హిట్ కొట్టారు. ఆతర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బ్రహ్మోత్సవం సినిమాలో కూడా ఇద్దరు నటించారు. కానీ భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.
ఆతర్వాత తమిళ్ సినిమా మెర్సల్ అదిరిందిలో కూడా కాజల్ అగర్వాల్, సమంత కలిసి నటించారు. ఈ సినిమాలో విజయ్ దళపతి హీరోగా నటించగా కాజల్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జనతా గ్యారేజ్ లో సమంత హీరోయిన్ గా నటించగా స్పెషల్ సాంగ్ లో కాజల్ అగర్వాల్ లో నటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adirindi, Bramhothsavam, Brundavanam, Kajal Aggarwal, NTR, Samantha akkineni