పన్నెండేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పటి వరకు నటన తప్ప మరో ధ్యాసే పెట్టలేదు కాజల్. పెళ్లి కూడా చేసుకోకుండా సినిమాలతోనే బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు ఈ భామకు మరో ఆశ కూడా పుట్టింది. ఎక్కడ సంపాదించిందో అక్కడే పెట్టాలని ఫిక్సైపోయింది చందమామ. అందుకే ఇప్పుడు నిర్మాత అవతారం ఎత్తబోతుంది కాజల్. నమ్మడానికి కాస్త కష్టంగా అనిపిస్తుంది కానీ ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉండి నిర్మాణం ఎలా చేయాలో బాగానే నేర్చేసుకుంది కాజల్. అందుకే ఇప్పుడు తన సొమ్మును ఇక్కడే ఖర్చు చేయాలని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ.
పైగా అమ్మడు మంచి బిజినెస్ ఉమెన్ కూడా. జ్యూవెలరీ బిజినెస్ తో పాటు షూస్ కంపెనీ కూడా కాజల్ పేరు మీద ఉంది. చెల్లి నిషా అగర్వాల్ ఇవన్నీ చూసుకుంటుంది. ఇక ఇప్పుడు నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెడుతుంది కాజల్. KA వెంచర్ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌజ్ మొదలుపెడుతుంది కాజల్. ఇన్నాళ్లూ తనలోని నటిని మాత్రమే చూపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తనలో ఉన్న నిర్మాతను చూపిస్తానంటుంది ఈ చందమామ.
గతేడాది నాని నిర్మాతగా మారి చేసిన సినిమా అ.. ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మతో తొలి సినిమా ప్లాన్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ప్రస్తుతం క్వీన్ తమిళ రీమేక్ పారిస్ పారిస్ సినిమాతో పాటు కమల్ హాసన్ భారతీయుడు 2లో నటిస్తూ బిజీగా ఉంది కాజల్. మరి హీరోయిన్ గా సూపర్ స్టార్ అయిన కాజల్.. నిర్మాతగా ఏం చేస్తుందో చూడాలిక.గర్వా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kajal Aggarwal, Nani, Telugu Cinema, Tollywood