ఆ సన్నివేశాలుంటే.. కాజల్ సినిమాకి సెన్సార్ సందేహమే..

బాలీవుడ్‌లో హిట్ అయిన 'క్వీన్' సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ తన గ్లామర్ డోస్‌ను పెంచేసి కొంత బోల్డ్‌గా నటించిందట. ఆ మధ్య విడుదలైన ఆ చిత్రం టీజర్‌ కూడా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ అయింది.

news18-telugu
Updated: June 7, 2019, 11:02 AM IST
ఆ సన్నివేశాలుంటే.. కాజల్ సినిమాకి సెన్సార్ సందేహమే..
కాజల్ అగర్వాల్ Photo: Twitter.com/MsKajalAggarwal
  • Share this:
కాజల్ అగర్వాల్..తెలుగు సినిమాల్లో అవసరమున్న మేరకు అందచందాలతో అలరిస్తూనే మంచి నటిగాను పేరు తెచ్చుకుంది. అంతే కాకుండా స్టార్ హీరోయిన్‌గా కూడా గుర్తింపు పొంది ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటూ తమిళ్, హిందీ సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే కేరిర్ మొదట్లో  గ్లామర్ పాత్రలకే పరిమితమైన కొంత కుదురుకున్న తర్వాత నటనకు ప్రాధాన్యమున్న సినిమాలతో అభిమానుల్ని సంపాదించుకుంది కాజల్. టాలీవుడ్‌కి పరిచయమై పది సంవత్సరాలు అవుతోన్న.. ఎప్పుడు మరీ బోల్డ్‌గా హద్దుమీరి నటించలేదు ఈ భామ. అయితే బాలీవుడ్‌లో హిట్ అయిన 'క్వీన్' సినిమాను తమిళంలో 'పారిస్ పారిస్‌'గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాజల్ తన గ్లామర్ డోస్‌ను పెంచేసి కొంత బోల్డ్‌గా నటించిందట. పాత్రకి అవసరమంటూ కాజల్ కూడా కన్విన్స్ అయి ఆ సన్నివేశాలలో నటించాల్సి వచ్చిందని టాక్. దీనికి తోడు ఇటీవల విడుదలైన ఆ చిత్రం టీజర్ వైరల్ అయిన విషయం తెలిసేందే. ఆ టీజర్‌లో ఓ బోల్డ్ సన్నివేశం‌లో కాజల్ ఛాతి భాగాన్ని మరో నటి పట్టుకొనే దృశ్యం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. ఇంతలా రెచ్చిపోయిన కాజల్‌ సినిమాకు సెన్సార్ సభ్యులు ఆమోదిస్తారా లేదా అనే చర్చ జరుగుతోంది అభిమానుల్లో. ఈ చిత్రానికి సెన్సార్ క్లియరన్స్ వస్తుందా..? రాదా..? అని తెగ అందోళన పడుతున్నారట ఆమె అభిమానులు. ఒకవేళ సెన్సార్ సభ్యులు యాక్సెప్ట్ చెయ్యకపోతే ఆ సన్నివేశాలను యూట్యూబ్‌లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట.

కాజల్ అగర్వాల్ Photo: Twitter.com/MsKajalAggarwal


'క్వీన్' సినిమాను తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో తమన్నా చేస్తుండగా, తమిళంలో కాజల్, కన్నడలో పారుల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్ హీరోయిన్స్‌గా చేస్తున్నారు.First published: June 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు