#Me Too: కాస్టింగ్ కౌచ్‌పై కాజల్ అగర్వాల్ కమెంట్స్..

ఇండ‌స్ట్రీలో ఉన్న టాప్ మెంబ‌ర్స్ అంతా మీటూ ఉద్య‌మంలో మాట్లాడుతున్నారు. ఇండ‌స్ట్రీ ఏదైనా కూడా ఇప్పుడు వేధింపుల గురించి ర‌చ్చ ఎక్కువైపోయింది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా బ‌య‌టికి వ‌చ్చి అంతా త‌మ‌కు జ‌రిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 11, 2018, 3:31 PM IST
#Me Too: కాస్టింగ్ కౌచ్‌పై కాజల్ అగర్వాల్ కమెంట్స్..
కాజల్ అగర్వాల్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఇండ‌స్ట్రీ ఏదైనా కూడా ఇప్పుడు వేధింపుల గురించి ర‌చ్చ ఎక్కువైపోయింది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా బ‌య‌టికి వ‌చ్చి అంతా త‌మ‌కు జ‌రిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇదే విష‌యంపై కాజ‌ల్ కూడా స్పందించింది. అయితే ఈ ముద్దుగుమ్మే కొన్ని రోజుల కింద శ్రీ‌రెడ్డి ఇష్యూలో మ‌రోలా స్పందించింది. అప్పుడు శ్రీ‌రెడ్డి బ‌య‌టికి వ‌చ్చి క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడితే.. త‌న‌కు అలాంటి అనుభ‌వాలే ఎదురు కాలేద‌ని చెప్పింది ఈ భామ‌. అయితే ఇప్పుడు ఈ చంద‌మామే మ‌ళ్లీ మీటూ ఉద్యమానికి స‌పోర్ట్ చేసింది.

ఇప్పుడు ఏమంటావ్ కాజ‌ల్.. మీటూ అంటున్న చంద‌మామ‌...! kajal agarwal supports me too campaign..
కాజల్ అగర్వాల్


ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలో ఉన్న టాప్ మెంబ‌ర్స్ అంతా మీటూ ఉద్య‌మంలో మాట్లాడుతున్నారు. నానా పటేకర్, అలోక్ నాథ్, గాయకుడు కైలాశ్ ఖేర్, రచయిత చేతన్ భగత, దర్శకుడు సుభాష్ కపూర్, కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ లాంటి పలువురు ప్రముఖు లైంగిక వేధింపులకు గురి చేశారంటూ కొంద‌రు ఇండ‌స్ట్రీ నుంచి బ‌య‌టికి వ‌చ్చి మీడియా ముందు మాట్లాడారు. ఇక ఇప్పుడు కాజ‌ల్ కూడా మీటూ ఉద్యమంపై మాట్లాడింది.

ఇప్పుడు ఏమంటావ్ కాజ‌ల్.. మీటూ అంటున్న చంద‌మామ‌...! kajal agarwal supports me too campaign..
కాజల్ అగర్వాల్


లైంగిక వేధింపులకు పాల్పడే భూతాల గురించి మాట్లాడ‌టానికి.. నిజం చెప్ప‌డానికి చాలా ధైర్యం కావాలి.. ఇప్పుడు చాలా మంది ఇదే చేస్తున్నారు. దీనికి తాను కూడా మ‌ద్ద‌తు తెలుపుతున్నానంటూ ట్వీట్ చేసింది కాజ‌ల్. ఇప్పుడు అన్యాయం అయిపోయిన అమ్మాయిల చెంత నిల‌బ‌డానికి అంతా సిద్ధంగా ఉండాలి.. తాను కూడా ఉంటాన‌ని చెప్పింది కాజ‌ల్. అయితే కేవ‌లం ప‌బ్లిసిటీ కోస‌మే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అని కొంద‌రు అంటుండ‌టం మాత్రం చెత్త‌గా ఉంది.. అది మంచిది కాద‌ని వార్నింగ్ ఇచ్చింది కాజ‌ల్.

ఇప్పుడు ఏమంటావ్ కాజ‌ల్.. మీటూ అంటున్న చంద‌మామ‌...! kajal agarwal supports me too campaign..
కాజల్ అగర్వాల్


యాంక‌ర్ అన‌సూయ ఈ మ‌ధ్య ఇలాంటి క‌మెంట్స్ చేసింది. ఆమెకు కాక‌పోయినా ఆమె లాంటి వాళ్ల‌కే కాజ‌ల్ వార్నింగ్ వెళ్తుంది. పైగా కొన్ని రోజుల కింద అస‌లు త‌న‌కు ఎలాంటి అనుభవం ఎదురు కాలేద‌ని చెప్పిన కాజ‌ల్.. ఇప్పుడు స‌డ‌న్ గా రూట్ మార్చుకుని ఈ త‌ర‌హా ఇన్సిడెంట్స్ ఇక్క‌డ జ‌రుగుతున్నాయ‌ని చెప్ప‌డం మాత్రం ఆశ్చ‌ర్య‌మే. మొత్తానికి కాజ‌ల్ తీరుపై ఇప్పుడు చాలా సెటైర్లు పేలుతున్నాయి.
Published by: Praveen Kumar Vadla
First published: October 11, 2018, 3:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading