హోమ్ /వార్తలు /సినిమా /

పాపం కాజల్.. ఏ హీరోయిన్‌కు రాకూడదు అలాంటి కష్టాలు...

పాపం కాజల్.. ఏ హీరోయిన్‌కు రాకూడదు అలాంటి కష్టాలు...

కాజల్(Instagram/kajalaggarwalofficial)

కాజల్(Instagram/kajalaggarwalofficial)

కాజల్ అగర్వాల్.. ఈ అందాల మెరుపుతీగ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'చందమామ' సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది.

  కాజల్ అగర్వాల్.. ఈ అందాల మెరుపుతీగ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'చందమామ' సినిమాతో ఎక్కువమంది తెలుగువారికి  దగ్గరైంది. ఆ సినిమా హిట్ అవ్వడంతో  ఇక అప్పటినుండి వరుసగా సినిమాలు చేస్తూ.. దాదాపు ఓ దశాబ్దం కాలంగా తెలుగువారిని తన అందచందాలతో పాటు ఎవరిని నొప్పించని మనసుతో అలరిస్తూనే ఉంది.  స్టార్ హీరోయిన్‌గా కూడా గుర్తింపు పొందిన కాజల్ ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటూ తమిళ్, హిందీ సినిమాలు చేస్తోంది. అయితే కేరిర్ మొదట్లో  గ్లామర్ పాత్రలకే పరిమితమైన కొంత కుదురుకున్న తర్వాత నటనకు ప్రాధాన్యమున్న సినిమాలతో అభిమానుల్ని సంపాదించుకుంది కాజల్.

  View this post on Instagram

  🌸


  A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on  అది అలా ఉంటే హిందీలో 2013లో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో వచ్చిన క్విన్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ సినిమాలో కంగనా నటనకు మంచి మార్కులు పడ్డాయి. దానికితోడు మంచి కలెక్షన్స్‌ను కూడా రాబట్టి బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. కాగా ఆ సినిమాను తెలుగు తమిళ భాషాల్లో రీమేక్ చేశారు. తెలుగులో తమన్నా చేయగా.. తమిళ్‌లో మాత్రం కాజల్ 'పారిస్ పారిస్' అంటూ ప్రధాన పాత్ర పోషించింది. దీనికి సంబందించిన టీజర్ కూడా విడుదలైంది. ఆ టీజర్‌లో కొంత గ్లామర్ డోస్‌ను పెంచేసి కొంత బోల్డ్‌గా కాజల్ నటించిందని టాక్. పాత్రకి అవసరమంటూ కాజల్ కూడా కన్విన్స్ అయి ఆ సన్నివేశాలలో నటించాల్సి వచ్చిందట. దానికి బలం చేకూర్చుతూ... ఆ మధ్య విడుదలైన ఆ చిత్రం టీజర్ వైరల్ అయిన విషయం తెలిసేందే.


  ఆ టీజర్‌లో ఓ బోల్డ్ సన్నివేశం‌లో కాజల్ ఛాతి భాగాన్ని మరో నటి పట్టుకొనే దృశ్యం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. ఇంత కష్టపడి సినిమా చేస్తే ఇంతవరకు ఆ సినిమా విడుదల అవుతుందో లేదో అని బాధ పడుతుందట కాజల్. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. కాగా మరోవైపు ఇంతలా రెచ్చిపోయిన కాజల్‌ సినిమాకు సెన్సార్ సభ్యులు ఆమోదిస్తారా లేదా అనే  అభిమానులు అందోళన చెందుతున్నారు.  అంతలా కష్టపడి తమ అభిమాన నటి కాజల్ ఓ మంచి సినిమా చేస్తే.. ఈ చిత్రానికి అసలు సెన్సార్ క్లియరన్స్ వస్తుందా..? రాదా..? విడుదలౌతుందా లేదా.. అని తెగ అందోళన పడుతున్నారట ఆమె అభిమానులు.

  కాజల్ అదిరిపోయే పిక్స్

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Kajal Aggarwal, Tamil Film News, Telugu Cinema News

  ఉత్తమ కథలు