Kajal Aggarwal : కాజల్ అగర్వాల్‌కు కష్టాలు... ఆ సినిమా రిలీజ్ అవుతుందా.. లేదా..!

Kajal Aggarwal : హిందీలో హిట్ అయిన 'క్వీన్' సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ తన గ్లామర్ డోస్‌ను పెంచేసి కొంత బోల్డ్‌గా నటించిందని టాక్.

news18-telugu
Updated: August 19, 2019, 8:21 AM IST
Kajal Aggarwal :  కాజల్ అగర్వాల్‌కు కష్టాలు... ఆ సినిమా రిలీజ్ అవుతుందా.. లేదా..!
Photo: Instagram
news18-telugu
Updated: August 19, 2019, 8:21 AM IST
కాజల్ అగర్వాల్..ఈ అందాల మెరుపుతీగ 'చందమామ' సినిమాతో ఎక్కువమంది తెలుగువారికి పరిచయమైంది. అప్పటినుండి..దాదాపు ఓ దశాబ్దం కాలంగా తెలుగువారిని తన అందచందాలతో అలరిస్తూనే ఉంది. అంతేకాకుండా స్టార్ హీరోయిన్‌గా కూడా గుర్తింపు పొంది ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటూ తమిళ్, హిందీ సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే కేరిర్ మొదట్లో  గ్లామర్ పాత్రలకే పరిమితమైన కొంత కుదురుకున్న తర్వాత నటనకు ప్రాధాన్యమున్న సినిమాలతో అభిమానుల్ని సంపాదించుకుంది కాజల్. అభినయంతో అగ్ర కథానాయికగా రాణిస్తున్న కాజల్‌ ఇటీవల.. ఎలాంటీ మేకప్ లేకుండా దిగిన ఫొటోల్ని తన సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. అప్పట్లో అవి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫోటోలను చూసిన నెటిజెన్స్.. ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్న సంగతి తెలిసిందే.



 




Loading...

View this post on Instagram





 

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on





అది అలా ఉంటే కాజల్ తమిళ్ సినిమా 'పారిస్ పారిస్'లో గ్లామర్ డోస్‌ను పెంచేసి కొంత బోల్డ్‌గా నటించిందని టాక్. పాత్రకి అవసరమంటూ కాజల్ కూడా కన్విన్స్ అయి ఆ సన్నివేశాలలో నటించాల్సి వచ్చిందట. దానికి బలం చేకూర్చుతూ... ఆ మధ్య విడుదలైన ఆ చిత్రం టీజర్ వైరల్ అయిన విషయం తెలిసేందే. ఆ టీజర్‌లో ఓ బోల్డ్ సన్నివేశం‌లో కాజల్ ఛాతి భాగాన్ని మరో నటి పట్టుకొనే దృశ్యం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. ఇంతలా రెచ్చిపోయిన కాజల్‌ సినిమాకు సెన్సార్ సభ్యులు ఆమోదిస్తారా లేదా అనే  అభిమానులు చర్చించుకుంటున్నారు.  అంతలా కష్టపడి తమ అభిమాన నటి కాజల్ ఓ మంచి సినిమా చేస్తే.. ఈ చిత్రానికి అసలు సెన్సార్ క్లియరన్స్ వస్తుందా..? రాదా..? అని తెగ అందోళన పడుతున్నారట ఆమె అభిమానులు. అయితే ఒకవేళ సెన్సార్ సభ్యులు ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను యాక్సెప్ట్ చెయ్యకపోతే వాటిని యూట్యూబ్‌లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట చిత్ర బృందం.
First published: August 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...