అందాల కైరా అద్వాని.. సొగసుల కహానీ..

బాలీవుడ్ హీరోయిన్ల‌కు రెండే రెండు బాగా తెలుసు. ఒక‌టి మంచి పాత్ర వ‌స్తే న‌టించ‌డం.. న‌టించినా కూడా అందాల ఆర‌బోత‌కు రెడీగా ఉండ‌టం. రెండూ చేసి చంపేస్తుంటారు. ఇప్పుడు కైరా అద్వాని కూడా ఇదే చేస్తుంది. తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా.. కానీ కైరా అద్వానికి మంచి ఇమేజ్ ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 28, 2018, 4:19 PM IST
అందాల కైరా అద్వాని.. సొగసుల కహానీ..
కైరా అద్వాని
  • Share this:
బాలీవుడ్ హీరోయిన్ల‌కు రెండే రెండు బాగా తెలుసు. ఒక‌టి మంచి పాత్ర వ‌స్తే న‌టించ‌డం.. న‌టించినా కూడా అందాల ఆర‌బోత‌కు రెడీగా ఉండ‌టం. రెండూ చేసి చంపేస్తుంటారు. ఇప్పుడు కైరా అద్వాని కూడా ఇదే చేస్తుంది. తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా.. కానీ కైరా అద్వానికి మంచి ఇమేజ్ ఉంది. "భ‌ర‌త్ అనే నేను"లో మ‌హేశ్ బాబుతో జోడీక‌ట్టే స‌రికి అమ్మ‌డుకు ఫుల్ క్రేజ్ వ‌చ్చేసింది. అందం ప్ల‌స్ అభిన‌యంతో మాయ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.

అందాల కైరా అద్వాని.. సొగసుల కహానీ.. kaira advani hot romance with shahid kapoor..
కైరా అద్వాని ట్విట్టర్ ఫోటో


హిందీలో ఇప్ప‌టికే "ధోనీ" లాంటి సినిమాల్లో న‌టించింది కైరా. ఇక తెలుగులో కూడా ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ సినిమాలో న‌టిస్తుంది కైరాఅద్వాని. అయితే సినిమా ఏదైనా కూడా అందాల ఆర‌బోతే ధ్యేయంగా ముందుకెళ్తుంది ఈ భామ‌. ఇప్ప‌టికే "ల‌స్ట్ స్టోరీస్"లో అమ్మడు చేసిన ర‌చ్చకు అంద‌రి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇక ఇప్పుడు మ‌రోసారి అందాల బాంబ్ పేల్చింది కైరా.
తాజాగా షాహిద్ క‌పూర్‌తో ఊర్వ‌శి ప్రైవేట్ సాంగ్‌లో జోడీ క‌ట్టింది ఈ భామ‌. ఇందులో ఫుల్ ఎక్స్‌పోజింగ్‌తో పిచ్చెక్కించింది కైరా. "అర్జున్ రెడ్డి"లో షాహిద్‌తోనే జోడీ క‌ట్ట‌బోతుంది ఈ ముద్దుగుమ్మ‌. ఆలోపే ఇప్పుడు ప్రైవేట్ సాంగ్‌లో స్క్రీన్ షేర్ చేసుకుంది కైరా. మొత్తానికి కాన్సెప్ట్ ఏదైనా.. క‌థ ఏదైనా కూడా అందాల్నే ముందు పెడుతుంది ఈ ముద్దుగుమ్మ‌.
First published: September 28, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>