KADHAL FAME ACTOR PALLU BABU FOUND DEAD IN A AUTO AND KOLLYWOOD AUDIENCE WAS IN SHOCK ABOUT IS DEMISE SSR
Pallu Babu: కోలీవుడ్‌లో విషాదం.. ఈ వ్యక్తి గుర్తున్నాడా.. అందరినీ నవ్వించిన ఈ నటుడికి ఇలాంటి చావా...!
పల్లు బాబు
తల్లిదండ్రుల మరణం పల్లు బాబును బాగా కుంగతీసినట్టు తెలిసింది. ఆ బాధతో పాటు సినిమా అవకాశాలు కూడా పెద్దగా రాకపోవడంతో కొన్నేళ్లుగా పూట గడవడమే కష్టం మారింది. కొన్ని నెలలుగా తినడానికి తిండి లేక...
చెన్నై: తమిళ్లో ‘కాదల్’ పేరుతో విడుదలై తెలుగులో ‘ప్రేమిస్తే’గా తెలుగు ప్రేక్షకులను అలరించిన సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో వృశ్చికకాంత్ బాబుగా కామెడీ పండించిన పల్లు బాబు చెన్నైలో రోడ్డు పక్కన పార్క్ చేసిన ఓ ఆటోలో విగతజీవిగా కనిపించాడు. తల్లిదండ్రుల మరణం పల్లు బాబును బాగా కుంగతీసినట్టు తెలిసింది. ఆ బాధతో పాటు సినిమా అవకాశాలు కూడా పెద్దగా రాకపోవడంతో కొన్నేళ్లుగా పూట గడవడమే కష్టం మారింది. కొన్ని నెలలుగా తినడానికి తిండి లేక పల్లు బాబు చెన్నై రోడ్ల మీద భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగించాడు. గుళ్ల వద్దకు వెళ్లి బిచ్చగాళ్ల పక్కన కూర్చుని ఎవరైనా ప్రసాదం, ఆహారం పెడితే తినేవాడు. అతనిని అందరూ పల్లుబాబుగా పిలిచేవారు కానీ.. అతని అసలు పేరు శ్రీరాములు. వయసు 35 సంవత్సరాలు. లాక్డౌన్ సమయంలో పల్లుబాబు పరిస్థితి మరింత దీనంగా మారింది.
ఫుట్‌పాత్‌ల మీద పడుకుంటూ ఆకలితో అలమటించాడు. ఇతనికి మందు తాగే అలవాటు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అడుక్కోవడం ద్వారా వచ్చిన డబ్బులతో మద్యం సేవించి ఫుట్‌పాత్‌లపై పడుకునేవాడు. తల్లిదండ్రులు చనిపోయినప్పటి నుంచి పల్లు బాబు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. తాను ఒంటరినయ్యాననే బాధ అతనిని వెంటాడింది. ఆ క్రమంలోనే మద్యం ఎక్కువగా సేవించేవాడు. కొందరు స్నేహితులు దయతలచి ఆర్థిక సాయం చేసినప్పటికీ అతనికది తాత్కాలిక సాయంగానే మిగిలింది. సినిమా ఛాన్సుల ఊసేలేదు.
కర్నూలు ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించిన సీఎం జగన్
రోడ్డు పక్కన పార్క్ చేసిన ఆటోరిక్షాలో పల్లుబాబు చనిపోయి పడి ఉన్నాడని, పెట్రోలింగ్ టీం గుర్తించి తమకు సమాచారం అందించారని చెన్నై పోలీసులు తెలిపారు. పల్లు బాబు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం పూర్తయిన అనంతరం పల్లు బాబు మృతదేహాన్ని సమీప బంధువుకు అప్పగించారు. ‘ప్రేమిస్తే’ సినిమాలో కొద్దిసేపు సీన్‌తోనే నవ్వులు పూయించిన ఈ నటుడి జీవితం ఇలా అర్థాంతరంగా ముగియడం కోలీవుడ్‌లో విషాదం నింపింది. ‘ప్రేమిస్తే’ సినిమాలో స్టార్ అవుదామని సిటీకి వచ్చిన వృశ్చిగకాంత్ బాబు అనే యువకుడి పాత్రలో పల్లు బాబు నటించాడు.
చిరంజీవి, పవన్ కల్యాణ్, ‘భాషా’లో రజనీకాంత్ గెటప్, ‘అన్నమయ్య’లో నాగార్జున గెటప్‌తో ఫొటోషూట్ చేసుకుని.. ఆ ఫొటోలు తీసుకొచ్చి డైరెక్టర్‌కు ఇచ్చి.. తన పేరు గురించి చెప్పే ఆ యువకుడి పాత్ర మంచి హాస్యాన్నే పండించింది. అది చిన్న సీనే అయినా.. పల్లు బాబుకు మంచి పేరే వచ్చింది. తనది వృశ్చిక రాశి అని, వృశ్చికం పక్కన కాంత్ చేరిస్తే పెద్ద స్టార్ అవుతావని జ్యోతిష్యుడు చెప్పడంతో ఆ పేరు పెట్టుకున్నానని పల్లు బాబు చెప్పే మాటలు హాస్యాన్ని పండించాయి.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.