విజ‌య్ దేవ‌ర‌కొండ డియర్ కామ్రేడ్‌కు నో అంటున్న హిందీ అర్జున్ రెడ్డి..

Vijay Devarakonda : విజయ్ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం విడుద‌ల‌కు ముందే హిందీలో రీమేక్ చేయ‌డానికి హిందీ పాపులర్  డైరెక్ట‌ర్ క‌ర‌ణ్ జోహార్ ఆస‌క్తి చూపించిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నాడు.

news18-telugu
Updated: August 10, 2019, 9:32 AM IST
విజ‌య్ దేవ‌ర‌కొండ డియర్ కామ్రేడ్‌కు నో అంటున్న హిందీ అర్జున్ రెడ్డి..
Photo : Instagram.com/shahidkapoor
news18-telugu
Updated: August 10, 2019, 9:32 AM IST
విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఆయన తెలుగులోనే కాదు అన్ని భాష‌ల్లోనూ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ఆయన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ ఇటీవలే నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం విడుద‌ల‌కు ముందే హిందీలో రీమేక్ చేయ‌డానికి హిందీ పాపులర్  డైరెక్ట‌ర్ క‌ర‌ణ్ జోహార్ ఆస‌క్తి చూపించారు. ఈ క్ర‌మంలోనే రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నాడు ఈ ద‌ర్శ‌క నిర్మాత‌. ఈ సినిమా విడుదలకు ముందే ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. ‘డియర్ కామ్రేడ్’  గురించి కరణ్ మాట్లాడుతూ.. ఇది ఓ అందమైన ప్రేమకథ అని, తనకు బాగా నచ్చిందని తెలిపారు. అయితే ఈ హిందీలో ఈ సినిమా కోసం షాహిద్‌ కపూర్‌ను ఎంపికచేసుకోవాలని కరణ్‌ భావించారని, అంతేకాదు.. ఈ సినిమా కోసం షాహిద్‌ ఏకంగా రూ.40 కోట్లు అడిగినట్లు.. ఆ డిమాండ్‌కు కరణ్ కూడా ఓకే అన్నట్టు  వార్తలొచ్చాయి. 
Loading...

View this post on Instagram
 

Tomorrow - the world will see Lilly and Bobby's heart warming journey. 1 day to #DearComrade


A post shared by Vijay Deverakonda (@thedeverakonda) on

అయితే తాజాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ రీమేక్‌లోనే నటించనని షాహిద్‌ అన్నారట. షాహిద్ ఇప్పటికే ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌ కబీర్ సింగ్‌లో నటించాడు. మరోసారి ఇప్పుడు ‘డియర్‌ కామ్రేడ్‌’ రీమేక్‌ చేస్తే ప్రేక్షకులను ఆకట్టుకోదేమోనన్న ఉద్దేశంతోనే సినిమాకు ‘నో’ చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. దీనికి తోడు తెలుగులో ఇటీవల విడుదలైన 'డియర్ కామ్రేడ్' అనుకున్నంతగా అలరించలేదు.. దీంతో హిందీలో ఈ సినిమా రీమేక్ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో అనే సందేహంతో షాహిద్ వెనుకకు తగ్గినట్లు తెలుస్తోంది. అది అలా ఉంటే.. ఆయన, నాని జెర్సీ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నాడని టాక్.
First published: August 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...