Kiara Advani : కామెడీ సినిమా ‘ఫగ్లీ’ తో హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టిన కియరా అద్వానీ... ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’తో మరోసారి తెలుగువారిని పలకరించింది కియారా.. అయితే ఈ సినిమా అనుకున్నంతగా అలరించలేదు. హిందీలో మాత్రం హిట్ సినిమాలు చేస్తూ అదరగొడుతోంది. తెలుగులో ఘనవిజయం సాధించిన ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' లో హీరోయిన్గా చేసి అందరి హృయాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం కియారా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. 'కబీర్ సింగ్' సక్సెస్‌తో కియారా అద్వానీ హాట్ ఫేవరేట్‌గా మారింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తోనే రెండు చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకొన్నది. అక్షయ్ నటిస్తున్న 'గుడ్ న్యూస్', 'లక్ష్మీ బాంబ్' సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించనున్నది. లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న 'లక్ష్మీబాంబ్' హారర్ కామేడీ 'కాంచన'కు రీమేక్‌గా వస్తోంది. 'లక్ష్మీబాంబ్' 2020 జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
అది అలా ఉంటే కియారా.. మరో క్రేజీ ఆఫర్ తన ఖాతాలో వేసుకుంది. హిందీ సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించిన 'భూల్ భులయ్యా' రీమేక్‌కు రంగం సిద్ధమైంది. తెలుగు 'చంద్రముఖి' మూవీకి రీమేక్‌గా 2005లో రూపొందిన ఈ సినిమాకు సీక్వెల్‌గా హిందీలో 'భూల్ భులయ్యా 2' మూవీ రూపొందుతున్నది. అక్షయ్ కుమార్ స్థానంలో యువ హీరో కార్తీక్ ఆర్యన్ నటించనున్నారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ క్రేజీ ఆఫర్‌ను కొట్టేసింది. 'భూల్ భులయ్యా' చిత్రంలో అక్షయ్ కుమార్, విద్యాబాలన్ జంటగా రూపొందగా.. ప్రస్తుతం వారి స్థానంలో కియారా అద్వానీ, కార్తీక్ ఆర్యన్ జంటగా కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి అనిస్ బాజ్మీ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ భామ ఇటలీలో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. అక్కడి బీచ్‌ల్లో విహరిస్తూ.. ఎప్పటికప్పుడూ తన సోషల్ మీడియా ద్వారా ఫోటోలను పోస్ట్ చేస్తూ.. అలరిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kiara advani, Telugu Movie News