నాది ప్రేమ పెళ్లినే... కాబోయే వాడి గురించి క్లారిటీ ఇచ్చిన కియారా..

Kiara Advani : హిందీ 'అర్జున్ రెడ్డి'... 'కబీర్ సింగ్' బ్లాక్ బస్టర్ విజయంతో సూపర్ ఫామ్‌లో ఉన్న కియారా..ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రాతో వస్తున్న లవ్ ఎఫైర్‌‌తో పాటు తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు.

news18-telugu
Updated: September 2, 2019, 8:16 AM IST
నాది ప్రేమ పెళ్లినే... కాబోయే వాడి గురించి క్లారిటీ ఇచ్చిన కియారా..
‘కియారా అద్వానీ’ Instagram.com/kiaraaliaadvani
  • Share this:
కియారా అద్వానీ.. సూపర్ స్టార్ మ‌హేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమాతో గ్రాండ్‌గా  తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మహేష్‌తో నటించిన  ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌ హోదా దక్కించుకుంది కియారా. అంతేకాకుండా 'భరత్ అనే నేను'  బ్లాక్ బస్టర్ అవ్వడంతో  మరో సూపర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సరసన 'విన‌య విధేయ రామ'లో అవకాశం దక్కించుకుంది. అంతేకాదు.. ఆ సినిమాలో మంచి తన పరిధి మేరకు నటనతో ఆకట్టుకోవడమే కాకుండా అంద చందాలతో తెలుగువారిని భాగానే ఆకర్షించింది. కానీ భారీ అంచనాతో వచ్చిన ఆ సినిమాలో మేటర్‌ లేక.. బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో ఆ సినిమా తర్వాత మరే తెలుగులో సినిమాలో నటించలేదు. మరీ తెలుగులో అవకాశాలు రావాట్లేదా..లేదా ఈ భామ కావాలనే తెలుగు కథల్నీ పక్కకు పెడుతుందా.. తెలియదు. అది అలా ఉంటే... హిందీలో ఈ భామ ఇటీవల తెలుగు 'అర్జున్ రెడ్డి' రీమేక్..'కబీర్ సింగ్‌'లో షాహిద్ కపూర్ సరసన చేసిన సంగతి తెలిసిందే.. తెలుగులో అయితే విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి ఎలాంటీ బ్లాక్ బస్టర్ అయ్యిందో.. అలాంటీ మ్యాజికే హిందీలో కూడా రిపీట్ అయ్యింది.  హిందీ అర్జున్ రెడ్డిని కూడా సందీప్‌ రెడ్డినే దర్శకత్వం వహించారు.
కబీర్ సింగ్ సినిమా విడుదలైన తర్వాత.. ఆ సినిమాలో కాంటెంట్ ఎన్నో వివాదాలకు తావుచ్చింది. అయితే అన్ని వివాదాల మధ్య కూడా అద్బుతమైన వసూళ్లను రాబట్టి అదరగొట్టింది కబీర్ సింగ్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ విజయంతో సూపర్ ఫామ్‌లో ఉన్న కియారా.. ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. నేను సిద్ధార్థ్‌తో డేటింగ్‌లో ఉన్నానని వార్తలు వస్తున్నాయి. అయితే అందులో ఎంత మాత్రం నిజం లేదని పేర్కోంది. అంతేకాదు తాను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానని స్పష్టం చేసింది. అయితే పెళ్లి మాత్రం పెద్దలు కుదిర్చిన పెళ్లి కాకుండా.. కచ్చితంగా ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటా అంటూ తేల్చేసింది. కియారా ప్రస్తుతం.. లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న 'లక్ష్మీబాంబ్‌' అనే ఓ హారర్ కామేడీలో అక్షయ్ కూమార్ జంటగా నటిస్తోంది. ఈ సినిమా తెలుగులో లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన కాంచనకు రీమేక్‌గా వస్తోంది. 'లక్ష్మీబాంబ్‌' 2020  జూన్ 5న  ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 
View this post on Instagram
 

LAXMMI 💣


A post shared by KIARA (@kiaraaliaadvani) on
First published: September 2, 2019, 7:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading