అర్జున్ రెడ్డి చూసి హత్య చేసాడంట.. సారీ చెప్పిన సందీప్ రెడ్డి వంగా..
అర్జున్ రెడ్డి అనే ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ సినిమాను తనవైపు తిప్పుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. అయితే ఈ చిత్రం కుర్రాళ్లపై కూడా విపరీతమైన ప్రభావం చూపించింది. ఇప్పుడు ఈ చిత్రం చూసి ఓ వ్యక్తి..

సందీప్ రెడ్డి వంగా ఫైల్ ఫోటో
- News18 Telugu
- Last Updated: October 15, 2019, 5:53 PM IST
అర్జున్ రెడ్డి అనే ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ సినిమాను తనవైపు తిప్పుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. అయితే ఈ చిత్రం కుర్రాళ్లపై కూడా విపరీతమైన ప్రభావం చూపించింది. ఇప్పుడు ఈ చిత్రం చూసి ఓ వ్యక్తి తన ప్రేమికురాలిని హత్య చేసాడంటూ పోలీసులు చెప్పారు. దాంతో సందీప్ రెడ్డి వంగా కూడా దీనిపై స్పందించాడు. అసలు తను తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమాలో ఎక్కడా హత్యలు చేయమని ప్రోత్సహించలేదని చెప్పాడు సందీప్‌రెడ్డి వంగా. అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్ పేరుత రీమేక్ చేసాడు సందీప్. అక్కడ షాహిద్ కపూర్ హీరోగా నటించాడు.

ఈ ఏడాది విడుదలైన కబీర్ సింగ్.. అక్కడ కూడా 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం చూసి ఉత్తరప్రదేశ్ టిక్‌టాక్ స్టార్ అశ్వని కుమార్ విపరీతంగా ప్రభావితం అయ్యాడని పోలీసులు చెబుతున్నారు. ఆ సినిమాను చూసి అశ్విని తన ప్రేయసిని హత్య చేశాడని పోలీసులు అభిప్రాయపడటం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. మ్యాటర్ ఏంటంటే.. టిక్‌టాక్‌లో ఎప్పటికప్పుడు వీడియోలు పోస్ట్ చేయడం అశ్వినీ కుమార్‌కు అలవాటు. ఈయన వారం రోజుల కింద తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
దానికి ముందే ఆయన కొన్ని రోజుల నుంచి ఫ్లైట్ అటెండెంట్ నిఖితా శర్మను ప్రేమిస్తున్నాడు. కానీ రానున్న డిసెంబర్లో నిఖితకు మరొకరితో పెళ్లి జరగబోతుందని తెలుసుకున్న అశ్విని.. అది తట్టుకోలేక ఆమెను చంపేసాడు. ఆ తర్వాత పోలీసులు ఆరా తీస్తే ఈయనకు మరో మూడు హత్యలతో సంబంధం ఉందని తేల్చేసారు. నిఖితాను చంపేసిన తర్వాత ఈయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఆరా తీస్తే ఆయన టిక్ టాక్ వీడియోల్లో ఎక్కువగా కబీర్ సింగ్ డైలాగులు కనిపించాయి.. ఆమె నాకు దక్కని పక్షంలో.. మరొకరికి దక్కకూడదని అర్థం వచ్చేలా కొన్ని డైలాగులు చెప్పాడు అశ్విని.

ఇదంతా చూసి కబీర్ సింగ్ ప్రభావం ఈయనపై ఎక్కువగా పడి ఉంటుందని.. అందుకే ప్రేయసిని హత్య చేసాడని పోలీసులు భావించారు. దీనిపై ఇప్పుడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా స్పందించాడు. నిఖితా శర్మకు జరిగిన అన్యాయం పట్ల చాలా బాధగా ఉంది.. ఆమె కుటుంబానికి నా సానుభూతి తెలుపుతున్నాని చెప్పాడు సందీప్. ఓ ఫిల్మ్‌మేకర్‌గా నా పని తనానికి.. దాని ఫలితానికి బాధ్యత వహిస్తాను కానీ ఇతరుల్ని హత్య చేయమని నా సినిమాలు ఎప్పుడూ ప్రోత్సహించలేదని తెలిపాడు. తాను తెరకెక్కించిన అర్జున్ రెడ్డి కానీ.. కబీర్ సింగ్ కానీ ఎవర్ని హత్య చేయమని చెప్పలేదని.. అలా ప్రోత్సహించే అలవాటు కూడా తనకు లేదని చెప్పుకొచ్చాడు.

సందీప్ రెడ్డి వంగా ఫైల్ పోటో
ఈ ఏడాది విడుదలైన కబీర్ సింగ్.. అక్కడ కూడా 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం చూసి ఉత్తరప్రదేశ్ టిక్‌టాక్ స్టార్ అశ్వని కుమార్ విపరీతంగా ప్రభావితం అయ్యాడని పోలీసులు చెబుతున్నారు. ఆ సినిమాను చూసి అశ్విని తన ప్రేయసిని హత్య చేశాడని పోలీసులు అభిప్రాయపడటం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. మ్యాటర్ ఏంటంటే.. టిక్‌టాక్‌లో ఎప్పటికప్పుడు వీడియోలు పోస్ట్ చేయడం అశ్వినీ కుమార్‌కు అలవాటు. ఈయన వారం రోజుల కింద తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కబీర్ సింగ్ టిక్ టాక్ స్టార్ అశ్విని కుమార్
దానికి ముందే ఆయన కొన్ని రోజుల నుంచి ఫ్లైట్ అటెండెంట్ నిఖితా శర్మను ప్రేమిస్తున్నాడు. కానీ రానున్న డిసెంబర్లో నిఖితకు మరొకరితో పెళ్లి జరగబోతుందని తెలుసుకున్న అశ్విని.. అది తట్టుకోలేక ఆమెను చంపేసాడు. ఆ తర్వాత పోలీసులు ఆరా తీస్తే ఈయనకు మరో మూడు హత్యలతో సంబంధం ఉందని తేల్చేసారు. నిఖితాను చంపేసిన తర్వాత ఈయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఆరా తీస్తే ఆయన టిక్ టాక్ వీడియోల్లో ఎక్కువగా కబీర్ సింగ్ డైలాగులు కనిపించాయి.. ఆమె నాకు దక్కని పక్షంలో.. మరొకరికి దక్కకూడదని అర్థం వచ్చేలా కొన్ని డైలాగులు చెప్పాడు అశ్విని.

సందీప్ రెడ్డి వంగా ఫైల్ పోటో
షాలిని ఇది నీకు తగునా.. అంటూ తలలు పట్టుకుంటున్న టాలీవుడ్ నిర్మాతలు..
టాలీవుడ్లో ఆ హీరో అంటే క్రష్... సీక్రేట్ చెప్పేసిన రకుల్
Bigg Boss Telugu 3: బిగ్ బాస్ నుంచి అలీరెజా ఎలిమినేషన్‌కు విజయ్ దేవరకొండ కారణమా...?
బంపర్ ఆఫర్ కొట్టేసిన అర్జున్ రెడ్డి భామ.. రణ్వీర్ సింగ్‌తో.. మూడు సినిమాలు
అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇంట్లో విషాదం..
Loading...