కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్‌తో మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన సందీప్ వంగా..

'కబీర్‌ సింగ్‌' సూపర్ సక్సెస్‌తో సందీప్‌ రెడ్డికి మరో బంపర్‌ ఆఫర్‌ వచ్చినట్టుగా తెలుస్తోంది. కబీర్‌ సింగ్ సక్సెస్‌ గురించి.. దాని కలెక్షన్స్ గురించి విన్న హిందీ సూపర్ స్టార్, సందీప్‌తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని తెలుస్తోంది.

news18-telugu
Updated: June 29, 2019, 3:08 PM IST
కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్‌తో మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన సందీప్ వంగా..
సందీప్, కబీర్ సింగ్‌లో షాహీద్ కపూర్ Photo: twitter
news18-telugu
Updated: June 29, 2019, 3:08 PM IST
సందీప్‌ రెడ్డి వంగా.. 'అర్జున్‌ రెడ్డి' సినిమాతో టాలీవుడ్‌ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో సందీప్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అందులో భాగంగా ఆయనకు బాలీవుడ్‌లో మరోసారి 'అర్జున్ రెడ్డి' సినిమాను హిందీ ప్రేక్షకుల కోసం..దర్శకత్వం వహించే చాన్స్ వచ్చింది. ఈ హిందీ సినిమాలో దేవరకొండ పాత్రను షాహిద్ కపూర్, షాలినీ పాండే పాత్రను కియారా అద్వానీ చేశారు. తెలుగులో అయితే 'అర్జున్ రెడ్డి' ఎలాంటి మ్యాజిక్ చేసిందో..అదే మ్యాజిక్‌ అక్కడ కూడ రిపీట్ అయ్యింది. హిందీ అర్జున్ రెడ్డి..'కబీర్ సింగ్' విపరీతంగా వసూళ్లను రాబడుతోంది. దీంతో సందీప్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 'కబీర్ సింగ్'.. ఇప్పటికే 150 కోట్ల కలెక్షన్లు సాధించింది. అంతేకాదు ఈ సినిమా ఏడాది టాప్‌ 3 గ్రాసర్స్‌లో ఒకటిగా నిలుస్తుందంటున్నారు సినీ పండితులు.

సందీప్ వంగా, సల్మాన్ ఖాన్ Photo: Twitter
సందీప్ వంగా, సల్మాన్ ఖాన్ Photo: Twitter


'కబీర్‌ సింగ్‌' సూపర్ సక్సెస్‌తో సందీప్‌ రెడ్డికి మరో బంపర్‌ ఆఫర్‌ వచ్చినట్టుగా తెలుస్తోంది. కబీర్‌ సింగ్ సక్సెస్‌ గురించి.. దాని కలెక్షన్స్ గురించి విన్న హిందీ సూపర్ స్టార్ సల్మాన్‌ ఖాన్‌, సందీప్‌తో ఓ సినిమా చేసేందుకు సుముఖంగా ఉన్నాడని టాక్. ఈ సినిమాను కూడా 'కబీర్ సింగ్‌'ను నిర్మించిన నిర్మాణ సంస్థ టీ సిరీస్‌ నిర్మించేందుకు రెడీ అవుతున్నట్టుగా సమాచారం.


First published: June 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...