విడుదలైన రోజు విమర్శలు వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర మాత్రం అద్భుతాలు చేస్తున్నాడు కబీర్ సింగ్. అర్జున్ రెడ్డి రీమేక్ ఊహించిన దానికంటే భారీగానే వసూళ్లు సాధిస్తుంది. ఈ సినిమా తెలుగులో విడుదలై రెండేళ్లు గడిచినా కూడా ఇప్పటికీ అర్జున్ రెడ్డి పేరు మార్మోగిపోతుంది. ఇప్పుడు హిందీలో కూడా అర్జున్ రెడ్డి దుమ్ము దులిపేస్తున్నాడు. ఒరిజినల్ తెరకెక్కించిన దర్శకుడే కావడంతో ఎక్కడా గాడి తప్పకుండా కబీర్ సింగ్ను రీమేక్ చేసాడు. ఇప్పుడు అక్కడ కూడా కబీర్ సింగ్ మేనియా నడుస్తుంది. ఇప్పుడు ఇదే కలెక్షన్ల రూపంలో కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఫస్ట్ వీక్ అయ్యే వరకు రూ.125 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. ఇపుడు రూ.175 కోట్లను అధిగమించి రెండో వారంలో పద్మావత్ కంటే బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ వసూళ్లను రాబడుతున్నట్టు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేసాడు. సినిమాకు కాస్త యావరేజ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్లు మాత్రం అదిరిపోతున్నాయి.

‘కబీర్ సింగ్’ షాహిద్ కపూర్
మొత్తానికి చాలా కాలం తర్వాత షాహిద్ కపూర్.. సోలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక తెలుగులో అర్జున్ రెడ్డి విడుదల సమయంలో ఏ ప్రాబ్లెమ్స్ ఫేస్ చేసాడో.. హిందీలో కబీర్ సింగ్ అదే ప్రాబ్లెమ్స్ ఫేస్ చేసింది. క్రిటిక్స్ ఈ సినిమాను ఏకి పారేసినా..కూడా బాక్సాఫీస్ దగ్గర దమ్ము చూపెడుతోంది. ఇప్పటికే కొన్ని మహిళా సంఘాలు కూడా సినిమాలో అమ్మాయిల మనోభావాలు దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆరోపిస్తున్నారు. దాంతో పాటు మెడికల్ కాలేజీ తీరు కూడా తప్పుగా చూపించారని చెబుతున్నారు. అయితే దీనిపై హీరో షాహిద్ కపూర్ కూడా సీరియస్ అవుతున్నాడు. మొత్తానికి బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరో వారం కూడా కబీర్ సింగ్ హవా నడిచేలా ఉంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:June 30, 2019, 19:37 IST