సన్నీ లియోన్ పర్సనల్ నెంబర్ బాలీవుడ్ నటుడు అడిగారా?

బాలీవుడ్ నటుడు కబీర్ బేడి ఓ కార్యక్రమంలో సన్నీ లియోన్ పర్సనల్ నెంబర్ అడగ్గా ఆమె తన భర్త నెంబర్‌ను ఇచ్చిందంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

news18-telugu
Updated: February 21, 2020, 4:59 PM IST
సన్నీ లియోన్ పర్సనల్ నెంబర్ బాలీవుడ్ నటుడు అడిగారా?
సన్నీ లియోన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌కు సంబంధించి ఓ వివాదాస్పద కథనం ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. ఓ ఫోటోషూట్‌లో సన్నీ లియోన్‌ను కలిసిన 74 ఏళ్ల నటుడు కబీర్ బేడి...ఆమె ఫోటోలను చూసి అభినందించారట. ఆ సమయంలో సన్నీ లియోన్ పర్సనల్ ఫోన్ నెంబర్ ఇవ్వాలని కబీర్ బేడి అడగ్గా...ఆమె చాకచక్యంగా వ్యవహరించి తన భర్త డేనియల్ వెబెర్ మొబైల్ నెంబర్ ఇచ్చినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తన నెంబర్‌కు బదులు తన భర్త నెంబర్ ఇవ్వడం ద్వారా కబీర్ బేడిని సన్నీ లియోన్ ఘోరంగా అవమానించిందంటూ పేర్కొన్నాయి. ఇంతకీ మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్‌ పర్సనల్ నెంబర్‌ను కబీర్ బేడి ఎందుకు అడిగారంటూ పలురకాల  ఊహాగానాలను వండివార్చేశాయి బాలీవుడ్ మీడియా వెబ్‌సైట్లు.

ఈ కథనాలపై కబీర్ బేడి మండిపడ్డారు. తన పరువుకు భంగం కలిగించేలా ఈ కథనాలు ఉన్నాయని, సన్నీ లియోన్ పర్సనల్ నెంబర్ తాను అడగలేదని ఆయన చెప్పుకొచ్చారు. దబూ రత్నాని ఫోటోషూట్ కార్యక్రమంలో సన్నీ లియోన్ భర్త డేనియల్ ఫోన్ నెంబర్ అడిగానని...స్వయంగా అతనే తన ఫోన్‌లో నెంబర్‌ను సేవ్ చేసినట్లు వివరించారు. తన పరువుకు భంగం కలిగించేలా కథనాలను ప్రచురించిన మీడియా సంస్థలు వాటిని తొలగించి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అటు కబీర్ బేడి సన్నీ లియోన్ ఫోన్ నెంబర్‌ను అడిగినట్లు వెలువడిన కథనంపై సన్నీ లియోన్ భర్త కూడా స్పందించారు. కబీర్ బేడి, సన్నీ లియోన్ మధ్య చాలా ఏళ్ల పరిచయం ఉందన్నాడు. కబీర్ బేడి దగ్గర సన్నీ నెంబర్ ఉందని...ఆయన తన ఫోన్ నెంబర్‌ను ఎందుకు అడగకూడదని ప్రశ్నించారు. స్టోరీ కోసం ఇంతలా దిగజారకూడదంటూ ఎద్దేవా చేశారు.
First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు