హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: కార్తీక దీపం శౌర్య.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

Karthika Deepam: కార్తీక దీపం శౌర్య.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

కార్తీక దీపం శౌర్య

కార్తీక దీపం శౌర్య

కార్తీకదీపం సీరియల్‌లో డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత పాత్రలు ఎంత బాగా బుల్లితెరపై పండాయో.. అదే స్థాయిలో హిమ, సౌర్యల పాత్రలు కూడా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయేట్టుగా నటించారు

కార్తీక దీపం.. ఈ సీరియల్ బుల్లితెరపై ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. సీరియల్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో... సీరియల్‌లో నటించిన ప్రతీ పాత్ర కూడా అంతే గుర్తింపు పొందింది. ఈ సీరియల్‌లో డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత పాత్రలు ఎంత బాగా బుల్లితెరపై పండాయో.. అదే స్థాయిలో హిమ, సౌర్యల పాత్రలు కూడా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయేట్టుగా నటించారు. హిమ పాత్రలో సహృద, సౌర్య పాత్రలో బేబి క్రితికలు నటించి.. అద్భుత నటనతో ప్రేక్షకుల్ని మెప్పించారు. అందుకే వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగనే వచ్చింది. ఇక ఈ సీరియల్‌లో నటించిన బేబీ క్రితికకు సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. మహేష్ బాబు మూవీ సరిలేరు నికెవ్వరులో కార్తీక దీపం శౌర్య నటించిన విషయం తెలిసిందే.

తాజాగా కార్తీక దీపం శౌర్య అలియాస్... బేబీ క్రితికకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ పాటకు స్టెప్పులేస్తూ... శౌర్య అలరించింది. బృందావనంలో కృష్ణాడు వచ్చాడే అన్న పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది శౌర్య.దీంతో ఇప్పుడు ఆమె చేసిన డాన్స్ యూట్యూబ్‌ను షేక్ చేసింది. చాలామంది నెటిజన్లు ఇప్పటికే ఈ వీడియోను లైకులతో ముంచెత్తారు. రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఫెర్‌ఫామ్ చేసిన ఈ పాటను.. ఇప్పుడు.. శౌర్య డాన్స్ వేసి అలరించింది.

మరోవైపు కార్తీక దీపం సీరియల్‌లో హిమ, శౌర్యలు లేరు. సీరియల్‌లో హిమ, సౌర్యలు పెద్దవాళ్లు కాగా.. వాళ్ల ప్లేస్‌లో ఇద్దరు యంగ్ బ్యూటీస్ ఎంట్రీ ఇచ్చారు. వీళ్లిద్దరికీ జోడీగా మరో ఇద్దరు హీరోలను ‘కార్తీకదీపం’ సీరియల్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కోయిలమ్మ సీరియల్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ మానస్ కార్తీకదీపం సీరియల్‌లో యంగ్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే కార్తీక దీపం చైల్డ్ ఆర్టిస్టులుగా హిమ శౌర్య అందర్నీ మెప్పించారు.


కొన్ని ఎపిసోడ్‌లు అయితే ప్రత్యేకంగా ఈ ఇద్దరు పిల్లలపైనే నడిచాయి. పిల్లలే కానీ పిడుగులు అన్నట్టుగా అద్భుతమైన తన నటనతో ఆ పాత్రలో ఒదిగిపోయారు అందర్నీ మెప్పించారు. దీప, కార్తీక్‌లతో పోటీపడి నటించారు సహృద, క్రితికలు. అయితే ఈ పాత్రలు తప్పించి వాళ్ల ప్లేస్‌లో కొత్త క్యారెక్టర్లను తీసుకుని రావడంతో కార్తీకదీపం ప్రేక్షకులకు కాస్త నిరాశ అనే చెప్పాలి. దీప, కార్తీక్, మోనితలను తీసేసి ఇప్పటికే ఈ సీరియల్ రేటింగ్ పడిపోయింది. హిమ, సౌర్య పాత్రల్ని కూడా లేపేయడంతో కార్తీకదీపంపై ఇప్పుడు అంత ఆసక్తి చూపించడం లేదు.

First published:

Tags: Baby krithika, Karthika deepam, Karthika Deepam serial

ఉత్తమ కథలు