పవన్ కళ్యాణ్‌ జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు..

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో మండి పడ్డాడు కేఏ పాల్. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్‌తో తాను కలిస్తే బాగుంటుందని చెప్పిన పాల్ ఇప్పుడు మాత్రం..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 8, 2020, 8:29 PM IST
పవన్ కళ్యాణ్‌ జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు..
కేఏ పాల్ పవన్ కళ్యాణ్ (ka paul pawan kalyan)
  • Share this:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో మండి పడ్డాడు కేఏ పాల్. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్‌తో తాను కలిస్తే బాగుంటుందని చెప్పిన పాల్ ఇప్పుడు మాత్రం మాట మార్చారు. ఒకప్పుడు పవన్ పద్దుతులు బాగున్నాయి.. ఆయన పాలసీ బాగుందని చెప్పిన ఈయన ఇప్పుడేమో మాట మార్చి మండి పడుతున్నాడు. జనసేన పార్టీతో పాటు జనసేనాని కూడా పెద్ద మోసగాడే అంటూ రెచ్చిపోయాడు. పవన్‌కు అసలు నీతి నిజాయితీ అనే మాటకు అర్థం కూడా తెలియదని చెప్పుకొచ్చాడు ఈయన.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)


కట్టుబాట్లు లేని మనిషి అంటూ విమర్శించాడు. అందుకే జనసేనలో ముందు చేరిన పెద్ద వాళ్లంతా ఇప్పుడు పవన్ అసలు స్వరూపం తెలిసి బయటికి వెళ్లిపోతున్నారని చెప్పాడు పాల్. ఎమ్మెల్యే కూడా కాకముందే ఏడాదికో పార్టీతో పొత్తు పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడని.. అదే కానీ ఎమ్మెల్యే అయితే ఎలా ప్రవర్తిస్తారో అందరూ తెలుసుకోవాలని తెలిపాడు కేఏ పాల్. అందుకే ఆయనను నమ్మొద్దని ఘాటుగా రియాక్ట్ అయ్యాడు ఈయన.
కేఏ పాల్ పవన్ కళ్యాణ్ (ka paul pawan kalyan)
కేఏ పాల్ పవన్ కళ్యాణ్ (ka paul pawan kalyan)

పవన్ కళ్యాణ్ అంటే తనకు గౌరవం ఉందని.. తనకు ఆయన తమ్ముడు లాంటి వాడు అంటూ చెప్పుకొచ్చాడు పాల్. బీజేపీ అవసరానికి వాడే పార్టీ అని తెలిసినా కూడా దాంతో వెళ్తున్నాడని పవన్‌పై విమర్శల వర్షం కురిపించాడు. ఇంతకంటే పవన్ దిగజారే పరిస్థితికి వెళ్తాడని తాను అయితే అస్సలు అనుకోవడం లేదని చెప్పుకొచ్చాడు ఈయన. 2014లో బీజేపీ-టీడీపీకి మద్దతిచ్చాడని.. మొన్నటి ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యూనిస్టులతో కలిసి తిరిగారని గుర్తు చేశాడు.
కే ఏ పాల్ (KA Paul)
కే ఏ పాల్ (KA Paul)

ఇప్పుడు కమ్యూనిస్టులను వదిలేసి అధికార దాహంతో కమలం పార్టీ చెంతకు చేరాడని ఆరోపించాడు కేఏ పాల్. ఏపీలో కాపు సామాజిక వర్గం ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్‌కు కనీసం రెండు శాతం ఓట్లు కూడా పడలేదనే విషయం గుర్తుంచుకోవాలన్నాడు పాల్. అంతేకాదు పవన్ జీవితంలో సీఎం కాలేడని.. ఆయన డ్యాన్స్‌లు వేసుకోవడానికి సినిమాల్లోకి వెళ్లడమే మంచిదని సెటైర్లు వేసాడు పాల్. ఈయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఈయనపై విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: August 8, 2020, 8:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading