రామ్ గోపాల్ వర్మపై కేసు.. మహిళ ఫిర్యాదుతో..

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు సంబంధించి కేఏ పాల్ ఫొటోలను మార్ఫింగ్ చేశారంటూ పాల్ సహాయకురాలు జ్యోతి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను కలసి ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: December 9, 2019, 6:45 PM IST
రామ్ గోపాల్ వర్మపై కేసు.. మహిళ ఫిర్యాదుతో..
రామ్ గోపాల్ వర్మ twitter
  • Share this:
వివాదాస్పద సినిమాల దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు సంబంధించి కేఏ పాల్ ఫొటోలను మార్ఫింగ్ చేశారంటూ పాల్ సహాయకురాలు జ్యోతి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను కలసి ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మ నిర్మాణ సారధ్యంలో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రూపొందింది. అయితే, ఈ సినిమా మీద కొన్ని అభ్యంతరాలు రావడంతో సెన్సార్ కమిటీ సుమారు 90 కట్‌లు చెప్పింది. అయితే, దీనిపై వర్మ రివైజింగ్ కమిటీకి వెళ్లాడు. అక్కడ ఈ సినిమా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆ సందర్భంగా రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన ఓ ఫోటో బయటకు వచ్చింది. రామ్ గోపాల్ వర్మకు కేఏ పాల్ సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తున్నట్టుగా ఆ ఫొటో ఉంది. ఆ పక్కనే కేఏ పాల్ సహాయకురాలు జ్యోతి ఫొటో కూడా ఉంది.

కేఏ పాల్ రామ్ గోపాల్ వర్మకు సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తున్నట్టుగా మార్ఫింగ్ చేసిన ఫొటో (Source: RGV Twitter)


ఈ ఫొటోలో వర్మ తలను అతికించింది సాక్షాత్తూ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఫొటోకు. ఈ ఫొటోను ఎవరు మార్ఫింగ్ చేశారో తెలీదు. దీన్ని ఆర్జీవీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అనంతరం డిలీట్ చేశారు. ఈ ఫొటో మీదే ప్రస్తుతం సీసీఎస్ పోలీసులను కలసి జ్యోతి ఫిర్యాదు చేసింది.

First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>