K RAGHAVENDRA RAO DIRECTOR K RAGHAVENDRA RAO USED FRUITS AND FLOWERS FIRST TIME MANCHI DONGA MOVIE IN THIS HEROINE TA
K Raghavendra Rao: రాఘవేంద్రరావు దర్శకత్వంలో మొదటిసారి పండు పడింది ఈ కథానాయిక పైనే..
కే.రాఘవేంద్రరావు (File/Photo)
K Raghavendra Rao: | తెలుగు చిత్ర సీమలో ఓ హీరోయిన్ ను తెరపై ఎంత అందంగా చూపించాలో...ఏ ఏ యాంగిల్స్ లో చూపించాలో కే.రాఘవేంద్రరావుకు తెలిసినంతగా మరే దర్శకుడికి తెలియదు. ఇక ఈయన మొదటిసారి పండు వేసిన హీరోయిన్ ఎవరో తెలిస్తే.. ఆశ్యర్యపోతారు.
తెలుగు చిత్ర సీమలో ఓ హీరోయిన్ ను తెరపై ఎంత అందంగా చూపించాలో...ఏ ఏ యాంగిల్స్ లో చూపించాలో కే.రాఘవేంద్రరావుకు తెలిసినంతగా మరే దర్శకుడికి తెలియదు. దర్శకేంద్రుడి కెమెరాకు ప్రతి భామ ఒక ముద్దబంతి పూవ్వే. పదహారేళ్ల వయసు కన్నెపిల్ల భావాలను సిరిమల్లె పువ్వల్లే చాలా చక్కగా ఆవిష్కరించడం ఆయన స్టైల్. కథానాయికను శృంగారదేవతగా చూపించడంలో సక్సెస్ సాధించాడు.ఈయన రూపొందించే మూవీల్లో కథ, కథనంతో పాటు మ్యూజిక్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. అలాగే పాటల చిత్రీకరణలో.. హీరోయిన్ ను గ్లామర్ గా చూపించడంలో దర్శకేంద్రుడి శైలి విభిన్నమైనది. అందుకనే ఆయన మూవీని కేవలం పాటల కోసం మాత్రమే చూసే ప్రేక్షకులు నేటికి ఉన్నారు.
ముఖ్యంగా హీరోయిన్స్ నాభిపై ఆయన వేసే పూలు, పండ్ల కోసం రిపీట్ ఆడియన్స్ ఉండేవారంటే అతిశయోక్తి కాదు. ఇక ఈయన మొదటిసారి పండు వేసిన హీరోయిన్ ఎవరో తెలిస్తే.. ఆశ్యర్యపోతారు.
కే.రాఘవేంద్రరావు బ్రాండ్ పండ్లు (Facebook/Photo)
ఈ మద్యేే దర్శకుడిగా రాఘవేంద్రరావు 45 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నాడు. తండ్రి కే.యస్. ప్రకాష్, పౌరాణిక బ్రహ్మ కమలకర కామేశ్వరావు వద్ద ఓనమాలు నేర్చుకున్న రాఘవేంద్రరావు శోభన్ బాబు హీరోగా ‘బాబు’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. అంతేకాదు 100 పైగా చిత్రాలను డైరెక్ట్ చేసిన అతి కొద్ది మంది దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ఇక ఈయన అంతకు ముందు పూలు పండ్లు వినియోగించినా.. హీరోయిన్స్ పై పండ్లు వేయడం చిరంజీవి, విజయశాంతి, సుహాసిని హీరో, హీరోయిన్లుగా తెరకెక్కించిన ‘మంచి దొంగ’ సినిమాతో మొదలైంది.
’మంచి దొంగ’లో తొలిసారి విజయశాంతిపై పండు వేసిన దర్శకేంద్రుడు (Facebook/Photo)
ఈ సినిమాలో ‘బెడ్ లైట్ తగ్గించనా’ అనే పాటలో తొలిసారి విజయశాంతి పై పండ్లు వేసారు రాఘవేంద్రరావు. ఫస్ట్ నైట్కు సంబంధించిన పాట కాబట్టి వెరైటీగా ఉండాలని ఈ పాటను కాస్త కొత్తగా ప్లాన్ చేసారు. ఈ పాటకు చక్రవర్తి అద్భుతమైన బాణీలు సమకూర్చారు. చిరు, విజయశాంతిపై ఫస్ట్ నైట్ సన్నివేశం కాబట్టి లైట్లు ఆన్ చేసినపుడు ఓ బీట్.. ఆఫ్ చేసినపుడు మరో బీట్ వచ్చేలా చక్రవర్తి ఈ పాటకు ట్యూన్ అందించారు. అలా ‘మంచి దొంగ’ సినిమాలో విజయశాంతిపై తొలి పండు పడింది. విజయశాంతి తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ పై రాఘవేంద్ర రావు పూలు పండ్ల అభిషేకం చేసిన సంగతి తెలిసిందే కదా.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.