బాయ్ ఫ్రెండ్‌‌కు హగ్ ఇచ్చిన ఆమీర్ కూతురు ఇరా ఖాన్.. వైరల్ అవుతున్న వీడియో..

హిందీ సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌ను..తెలుగు వారికి మరోసారి పరిచయం చేయనక్కర లేదు. ఆయన వినూత్నమైన కథ, కథనాలు ఉన్న సినిమాలతో దేశం అంతా అభిమానుల్ని సంపాదించుకున్నారు.తాజాగా ఆమీర్ ఖాన్ కూతురు.. తన బాయ్‌ ఫ్రెండ్‌కు బహిరంగంగానే హగ్గులు ఇస్తూ వార్తల్లో నిలిచింది.

news18-telugu
Updated: June 28, 2019, 9:27 PM IST
బాయ్ ఫ్రెండ్‌‌కు హగ్ ఇచ్చిన ఆమీర్ కూతురు ఇరా ఖాన్.. వైరల్ అవుతున్న వీడియో..
తన బాయ్ ఫ్రెండ్‌తో ఆమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ (ఇన్‌స్టాగ్రామ్ ఫోటో)
  • Share this:
హిందీ సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌ను..తెలుగు వారికి మరోసారి పరిచయం చేయనక్కర లేదు. ఆయన వినూత్నమైన కథ, కథనాలు ఉన్న సినిమాలతో దేశం అంతా అభిమానుల్ని సంపాదించుకున్నారు. 'లగాన్', 'తారే జమీన్ పర్' ‘దంగల్’ లాంటీ కొత్త తరహా కథలతో అమీర్ అందరికంటే తాను చాలా  భిన్నం అని నిరూపించుకున్నారు. అదీ అలా ఉంటే ఆయన మొదటి భార్య కూతురు ఇరా ఖాన్ ప్రేమలో పడిందనే వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఇరాఖాన్..తన ప్రియుడుతో ఉన్న నెటింట్లో చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్‌గా ఈ భామ..ఇరా తన సోషల్ మీడియూ అకౌంట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఆస్క్ మీ ఎనీథింగ్' అంటూ.. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలో ఆమెను ఓ అభిమాని ఎవరితోనైనా డేటింగ్‌లో ఉన్నారా..? అని ప్రశ్నించగా, బదులుగా.. ఇరాఖాన్ ఫోటోను షేర్ చేసి అతనితో డేటింగ్‌లో ఉన్నట్టు చెప్పకనే చెప్పింది.





తాజాగా తన బాయ్ ఫ్రెండ్‌తో డాన్స్ చేస్తూ ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో తన ప్రియుడితో పరవశంలో తేలియాడుతూ.. హగ్ చేసుకున్న వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆవు చేనులో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా అన్నట్టు తన తండ్రి ఆమీర్ ఖాన్.. బాటలోనే ప్రేమలో మునిగితేలుతోందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 28, 2019, 9:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading