Jr. NTR Birthday : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బర్త్ డే కానుక..రేపు కొమురం భీం ఉగ్రరూపం విడుదల..

NTR Photo : Twitter

Jr. NTR Birthday : మే 20న జూనియర్ తారకరామారావు 38 వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇక ఈ బర్త్ డే ను కూడా కలిసి చేసుకునే అవకాశం లేదు.

  • Share this:
    జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో సోషల్ మీడియాపై ఒక లుక్కేస్తే ఈజీగా అర్థమవుతుంది. గత వారం రోజులుగా అడ్వాన్స్ విషెస్ తో అనేక రకాల హ్యాష్ ట్యాగ్స్ ను క్రియేట్ చేస్తున్నారు. మే 20న జూనియర్ తారకరామారావు 38 వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇక ఈ బర్త్ డే ను కూడా కలిసి చేసుకునే అవకాశం లేదు. ఇక తారక్ సినిమాల విషయానికి వస్తే రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఈ ఎడాది కూడా వచ్చే ఛాన్స్ లేదని టాక్ అయితే వస్తోంది. అయితే, రేపు యంగ్ టైగర్ బర్త్ డే ట్రీట్ ఇవ్వనుంది RRR టీమ్. ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి కీలక అప్ డేట్ వెలువడింది. ఈ చిత్రంలో కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ ఉగ్రరూపాన్ని రేపు చూడొచ్చని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ఓ ప్రకటనలో వెల్లడించింది. రేపు ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్టు తెలిపింది. అభిమానులు కరోనా సమయంలో ఇంటి వద్దనే ఉండాలని, సురక్షితంగా ఉండాలని ఆర్ఆర్ఆర్ యూనిట్ పిలుపునిచ్చింది. వేడుకలు జరపుకునేందుకు ఎవరూ బయటికి రావొద్దని స్పష్టం చేసింది.

    రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబరు 13న విడుదల చేయాలని చిత్రబృందం సంకల్పించినా, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా నెలన్నర పాటు షూటింగ్ చేస్తేనే చిత్రీకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత గ్రాఫిక్స్ పనులు, డబ్బింగ్, తదితర పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరపాలంటే ఎంతో సమయం పడుతుంది. దాంతో దసరా నాటికి ఈ చిత్రాన్ని తీసుకురావడం కష్టమని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


    మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ వచ్చే ఏడాది వీలైనంత తోందరగా మరొక సినిమాను అందించాలని ఉవ్విల్లూరుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశాడు. ఆ సినిమా 2023లో రానుంది.
    Published by:Sridhar Reddy
    First published: