JUNIOR NTR TRAFFIC FINE PAID BY HIS FAN AND HE ASKED A FAVOUR MS
Junior NTR: తారక్ ట్రాఫిక్ ఫైన్ చెల్లించిన అభిమాని.. ప్రతిఫలంగా భారీ టెండరే పెట్టాడుగా..
జూనియర్ ఎన్టీఆర్(ఫైల్)
Junior NTR: ఇటీవలే ఓఆర్ఆర్ మీద ఓవర్ స్పీడ్ లో కారును నడిపినందుకు గానూ ఎన్టీఆర్ కు ట్రాఫిక్ పోలీసులు వేయి రూపాయల జరిమానా విధించారు. అయితే సదరు అభిమాని దానిని చెల్లించాడు. దానికి ప్రతిఫలంగా అతడు.. ఎన్టీఆర్ కు భారీ టెండరే పెట్టాడు.
జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) కు సినిమాల పరంగానే గాక.. ఆయన వ్యక్తిత్వానికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఒక్క పిలుపు ఇస్తే చాలు.. ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు వాళ్లంతా. ఈ విషయం చాలా సార్లు రుజువైంది కూడా. కాగా.. తాజాగా యంగ్ టైగర్ అభిమాని ఒకరు తారక్ కు సంబంధించిన ట్రాఫిక్ జరిమానాను చెల్లించాడు. ఇటీవలే ఓఆర్ఆర్ మీద ఓవర్ స్పీడ్ లో కారును నడిపినందుకు గానూ ఎన్టీఆర్ కు ట్రాఫిక్ పోలీసులు వేయి రూపాయల జరిమానా విధించారు. అయితే సదరు అభిమాని దానిని చెల్లించాడు. దానికి ప్రతిఫలంగా అతడు.. ఎన్టీఆర్ కు భారీ టెండరే పెట్టాడు.
వివరాల్లోకెళ్తే... నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు మీద ఓవర్ స్పీడ్ లో కారు నడిపినందుకు గానూ ట్రాఫిక్ పోలీసులు జూనియర్ ఎన్టీఆర్ కు రూ. 1,035 జరిమానా వేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సదరు అభిమాని.. దానిని తానే స్వయంగా చెల్లించాడు. అందుకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ వివరాలను ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈ ట్వీట్ ను ఎన్టీఆర్ కు ట్యాగ్ చేశాడు. అయితే రిటర్న్ గిఫ్ట్ గా.. ‘తారక్ అన్నా.. నాతో పాటు నా స్నేహితులు కొంతమందికి మల్లికార్జున లేదా భ్రమరాంబ థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్లు ఇప్పించండి...’ అంటూ విన్నవించాడు. ఈ ట్వీట్ కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. ఈ ట్వీట్ కు ఎన్టీఆర్ గానీ.. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. కొమురం భీం గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి హీరోల ఫస్ట్ లుక్ ఫోటోలు, టీజర్లు వచ్చి అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి.. క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతున్నది.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.