హోమ్ /వార్తలు /సినిమా /

మహేశ్ బాబు, అల్లు అర్జున్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన ఎన్టీఆర్

మహేశ్ బాబు, అల్లు అర్జున్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన ఎన్టీఆర్

ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్

ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్

తన అన్న కళ్యాణ్ రామ్‌తో పాటు సంక్రాంతి బరిలో నిలుస్తున్న మహేశ్ బాబు, అల్లు అర్జున్‌కు సైతం ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

సినీ ఇండస్ట్రీకి సంక్రాంతి ఓ పెద్ద పండగ. ఈ సీజన్‌లో ఆడియెన్స్ ముందుకు వచ్చి హిట్ కొట్టాలని స్టార్ హీరోలు చాలా రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటుంటారు. ఈ సారి సంక్రాంతి బరిలో మహేశ్ బాబు, అల్లు అర్జున్ నిలుస్తున్నారు. మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ, అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాపై ఆడియెన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎంత మంచివాడవురా సినిమాతో కళ్యాణ్ రామ్ సంక్రాంతి రేసులో కాస్త లేటుగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్... తన అన్న కళ్యాణ్ రామ్‌తో పాటు సంక్రాంతి బరిలో నిలుస్తున్న మహేశ్ బాబు, అల్లు అర్జున్‌కు సైతం ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

మంచి సినిమాలను ఆదరించే గుణం ప్రేక్షకులకు ఉందన్న ఎన్టీఆర్... పండగ సందర్భంగా విడుదల కానున్న సినిమాలన్నీ బాగా ఆడాలని కోరుకున్నాడు. ఆ రకంగా పరోక్షంగా మహేశ్ బాబు, అల్లు అర్జున్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు తారక్. మనం అందుకుంటున్న విజయాలతో తెలుగు చిత్రసీమ మరింత ముందుకువెళ్లాలని కోరుకుంటున్నానని తెలిపాడు.

First published:

Tags: Ala Vaikunthapuramulo, Allu Arjun, Jr ntr, Kalyan Ram Nandamuri, Mahesh Babu, NTR, Sarileru Neekevvaru

ఉత్తమ కథలు