జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్... గుడ్ బాయ్స్ అనిపించారు...

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కలసి ఎన్టీఆర్ ఛారిటబుల్ సర్వీస్ పేరుతో సేవా కార్యక్రమాలు చేయనున్నారు.

news18-telugu
Updated: December 8, 2019, 8:11 PM IST
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్... గుడ్ బాయ్స్ అనిపించారు...
జూనియర్ ఎన్టీఆర్
  • Share this:
జూనియర్ ఎన్టీఆర్‌కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. అయితే, వారంతా ఎవరికి వారు అన్నట్టుగా ఉన్నారు. కానీ, ఇప్పుడు అందరూ ఒక్కతాటి మీదకు వచ్చి ఓ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్టీఆర్ చారిటబుల్ సర్వీసెస్ పేరుతో సామాజిక సేవ చేయనున్నారు. అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా వారు ముందడుగు వేస్తున్నారు. ఈ మేరకు వారు సోషల్ మీడియా ట్విట్టర్‌లో ఓ అకౌంట్ క్రియేట్ చేశారు. దీన్ని మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ ప్రజలకు పరిచయం చేశాడు.‘మా కార్యక్రమాలను మేం గతంలోలాగా సంతోషంగా నిర్వహిస్తాం. ఈసారి ఫ్యాన్స్ అందరం ఒక టీమ్‌గా పనిచేయనున్నాం. తారక్ మీద మా అభిమానం పేదలకు సాయం చేసే దిశగా నడిపిస్తోంది.’ అంటూ చారిటబుల్ సర్వీస్‌కు చెందిన లోగోను రిలీజ్ చేశారు. ఈ లోగోలో జూనియర్ ఎన్టీఆర్ చేతులు కట్టుకుని నవ్వుతున్న ఫొటో ఉంది.
First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>