Zombie Reddy : జూనియర్ చిరంజీవి తేజ సజ్జ (Teja Sajja) దూకుడు మాములుగా లేదు.. మరోసారి అక్కడ సత్తా చాటిన జాంబిరెడ్డి హీరో వివరాల్లోకి వెళితే.. చిరంజీవి (Chiranjeevi) హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చూడాలని వుంది’ సినిమాతో బాల నటుడిగా పరిచయమైన తేజ సజ్జ ఆ తర్వాత ‘ఇంద్ర’ సినిమాలో చిన్ననాటి చిరంజీవి పాత్రలో అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత చాలా యేళ్లకు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓ బేబి’(Oh Baby) సినిమాతో మళ్లీ యువ నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘జాంబీ రెడ్డి’ తో హీరోగా పరిచయమయ్యాడు.
తేజ సజ్జ హీరోగా వచ్చిన ఈ సినిమా ఆ మధ్య విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కరోనాను బ్యాగ్ గ్రౌండ్‌లో తీసుకుని జాంబి రెడ్డి (Zombie Reddy) సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం కూడా జోడించడంతో సినిమాలో నవ్వులు పువ్వులు పూసాయి. కామెడీ ఓ రేంజ్‌లో పేలింది. ఈ సినిమా థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన అందులోనే కామెడీ కూడా వర్కవుట్ చేయడంతో జనాలను బాగానే ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. రూ. 4 కోట్ల బడ్జెట్‌తో రూపోందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 15 కోట్ల వరకు వసూలు చేసింది.
చిన్న సినిమాగా వచ్చిన టాక్ బాగుండడంతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపింది. ఈ సినిమాలో తెలుగు అమ్మాయి నందినీ (Nandini), ఢిల్లీ బ్యూటీ దక్షనగర్కర్ హీరోయిన్స్‌గా నటించారు. గెటప్ శీను, హేమంత్, అన్నపూర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ (Zombie Reddy Sequel ) తెరకెక్కించబోతున్నట్టు దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపారు.అది అలా ఉంటే ఈ సినిమా 'జాంబి జోనర్‌లో వచ్చిన తొలి తెలుగు సినిమా. ఈ సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ మా కొనుగోలు చేసంది. కాగా ఈ సినిమా మొదటిసారి స్టార్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ప్రసారం చేస్తే ఏకంగా 9.7 టీఆర్పీ వచ్చింది. ఓ కొత్త హీరోకు ఈ రేంజ్ రేటింగ్ అంటే పెద్ద విశేషమే అంటున్నారు.
తాజాగా ఈ సినిమాను రెండో సారి కూడా టెలివిజన్‌లో టెలికాస్ట్ చేస్తే.. అపుడు కూడా 8.1 టీర్పీ సాధించింది. ఒక యంగ్ హీరో నటించిన సినిమాకు రెండో సారి కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం కూడా ఓ రికార్డే అని చెబుతున్నారు. తాజాగా మూడోసారి ఈ సినిమా 7.42 టీఆర్పీ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. మొత్తంగా వెండితెరపై ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా టీవీ తెరపై కూడా అదే రేంజ్‌లో రెస్పాన్స్ తెచ్చుకోవడం మాములు విషయం కాదంటున్నారు. అది కూడా ఓ అప్ కమింగ్ హీరో నటించిన సినిమాకు ఈ రేంజ్ రెస్ఫాన్స్ రావడం విశేషమే అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Teja Sajja, Tollywood