పవన్ కల్యాణ్ అన్యాయం చేశారంటూ... రాత్రంతా జూనియర్ ఆర్టిస్ట్ హైడ్రామా

మంగళవారం సాయంత్రం ఫిల్మ్ చాంబర్ వద్దకు జూనియర్ ఆర్టిస్ట్ బోయ సునీత చేరకుంది. పవన్ పై తీవ్ర విమర్శలు చేస్తూ... ఓ గదిలోకి వెళ్లి లోపల నుంచి తలుపులు వేసుకుంది.

news18-telugu
Updated: September 4, 2019, 10:26 AM IST
పవన్ కల్యాణ్ అన్యాయం చేశారంటూ... రాత్రంతా జూనియర్ ఆర్టిస్ట్ హైడ్రామా
పవన్ కళ్యాణ్ (Source: Twitter)
  • Share this:
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జూనియర్ ఆర్టిస్ట్ ఆందోళనకు దిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఫిల్మ్ చాంబర్‌లో జూనియర్ ఆర్టిస్ట్ సునీత హల్ చల్ చేసింది. రాత్రంతా ఒక రూంలో తనను తాను బందీంచుకొని నిరసనకు దిగింది. మంగళవారం సాయంత్రం ఫిల్మ్ చాంబర్ వద్దకు జూనియర్ ఆర్టిస్ట్ బోయ సునీత చేరకుంది. పవన్ పై తీవ్ర విమర్శలు చేస్తూ... ఓ గదిలోకి వెళ్లి లోపల నుంచి తలుపులు వేసుకుంది. పవన్ స్వయంగా వచ్చి సమాధానం చెబితేనే తాను బయటకు వస్తానంది. దీంతో ఆమెను బయటకు రప్పించేందుకు అక్కడున్న పలువురు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

తన సేవలను వాడుకుని, ఆపై అన్యాయం చేశారని సునీత పవన్ పై ఆరోపణలు చేసింది. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు. ఉదయం 6 గంటల సమయంలో ఫిల్మ్ చాంబర్ కార్యాలయానికి వచ్చి, బలవంతంగా తలుపులు తెరిచారు. సునీతను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. జనసేన పార్టీ కోసం తాను అహర్నిశలూ శ్రమించానని, తనను ఆదుకుంటానని చెప్పి వాడుకుని, ఇప్పుడు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించింది. అయితే జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు మాత్రం ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టి పారేస్తున్నారు.
First published: September 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading