• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • JUHI CHAWLA LOST HER DIAMOND EARRING AT AIRPORT SEEKS HELP ON TWITTER MNJ

Juhi Chawla : ప్లీజ్ అది దొరికితే నాకు తెచ్చివండి.. బాలీవుడ్ న‌టి జూహీ చావ్లా అభ్య‌ర్థ‌న‌

Juhi Chawla : ప్లీజ్ అది దొరికితే నాకు తెచ్చివండి.. బాలీవుడ్ న‌టి జూహీ చావ్లా అభ్య‌ర్థ‌న‌

జూహీ చావ్లా

''15 ఏళ్లుగా ధ‌రిస్తున్నా. నాతోనే ఉండేవి. కానీ అందులో ఒక‌టి ఇప్పుడు ఎక్క‌డో ప‌డిపోయింది. ఎవ‌రికైనా దొరికితే తెచ్చివ్వండి ప్లీజ్'' అని అభ్య‌ర్థించారు బాలీవుడ్ న‌టి జూహీ చావ్లా(Juhi Chawla)

  • Share this:
    Juhi Chawla: ''15 ఏళ్లుగా ధ‌రిస్తున్నా. నాతోనే ఉండేవి. కానీ అందులో ఒక‌టి ఇప్పుడు ఎక్క‌డో ప‌డిపోయింది. ఎవ‌రికైనా దొరికితే తెచ్చివ్వండి ప్లీజ్'' అని అభ్య‌ర్థించారు బాలీవుడ్ న‌టి జూహీ చావ్లా. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఆమె ఆదివారం ఓ పోస్ట్ చేశారు. ఇంత‌కు ఈ న‌టి పోగొట్టుకున్న‌ది ఏంటంటే డైమండ్ చెవి రింగు.

    ''ఈ ఉద‌యం ముంబయి ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌లో నా డైమండ్ చెవి రింగు ఎక్క‌డో ప‌డిపోయింది. అది దొరికిన వారు నాకు తెచ్చిస్తే నేను చాలా సంతోషిస్తా. లేదంటే పోలీసులకైనా ఇవ్వండి. మీకు మంచి బ‌హుమ‌తిని ఇస్తా. గ‌త 15 సంవ‌త్స‌రాలుగా ప్ర‌తి రోజు నేను ఈ చెవి రింగుల‌ను వాడుతున్నా. ద‌య‌చేసి వాటిని వెత‌క‌డంలో సాయం చేయండి'' అని కామెంట్ పెట్టారు.



    ఈ సంద‌ర్భంగా చెవి రింగు ఫొటోను కూడా ఆమె షేర్ చేసుకున్నారు. కాగా బాలీవుడ్‌లో ఎన్నో హిట్ చిత్రాల్లో న‌టించిన జూహీ చావ్లా ప్ర‌స్తుతం అరకొర చిత్రాల్లో మాత్రమే క‌నిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె త‌న భ‌ర్త‌తో క‌లిసి ప‌లు బిజినెస్‌ల‌లో పాలుపంచుకుంటున్నారు.
    Published by:Manjula S
    First published:

    అగ్ర కథనాలు