Home /News /movies /

JUDGE SEEKS CONTEMPT ACTION AGAINST ACTOR SURIYA FOR REMARKS ON JUDICIARY SK

Suriya: చిక్కుల్లో హీరో సూర్య... హైకోర్టు జడ్జి తీవ్ర ఆగ్రహం

హీరో సూర్య

హీరో సూర్య

ప్రజలంతా నీట్ పరీక్షను వ్యతిరేకించాలని సూర్య విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత #SURIYAagainstNEET హ్యాష్‌టాగ్ ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఆయనకు చాలా మంది సినీనటులు, నెటిజన్లు మద్దతు తెలిపారు.

    తమిళనాట నీట్ పరీక్షపై దుమారం రేగుతోంది. కరోనా సమయంలోనూ నీట్ పరీక్షకు అనుమతిచ్చిన సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టుతూ హీరో సూర్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను విమర్శించిన సూర్యపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని తమిళనాడు హైకోర్టు జడ్జి ఎస్.ఎం.సుబ్రమణ్యం.. చీఫ్ జస్టిస్ AP షాయ్‌కు లేఖరాశారు. మీడియాలో సూర్య వ్యాఖ్యలు చూశానన్న ఆయన.. న్యాయవ్యవస్థను కించపరిచేలా సూర్య వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ ధోరణి న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసానికి ముప్పుగా మారుతుందని.. సూర్యపై కోర్టు ధిక్కార చర్యలను ప్రారంభించి న్యాయవ్యవస్థ ఘనతను చాటిచెప్పాలని హైకోర్టు జడ్జి కోరాుు.

    కాగా, నీట్ పరీక్షపై హీరో సూర్య తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తమిళనాడులో ఒకే రోజు ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల మరణ వార్త విని గుండె పగిలిందని ట్విటర్ ద్వారా పేర్కొన్నారు సూర్య. విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిన సమయంలో ఓదార్పు చెప్పాల్సి రావడం సిగ్గుచేటని అన్నారు. కరోనా భయంతో వీడియో కాన్ఫరెన్ ద్వారా న్యాయం చేస్తున్న గౌరవనీయ న్యాయమూర్తులు.. విద్యార్థులను మాత్రం భయం లేకుండా నీట్ పరీక్షకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేయడం విడ్డూరమంటూ విమర్శలు గుప్పించారు సూర్య. ఇలాంటి పరీక్షలను మనునీతి పరీక్షలుగా అభివర్ణించారు సూర్య. విద్యార్థుల జీవితాలను బలి తీసుకోవడం తప్ప వీటి వల్ల ఒరిగేమీ ఉండదని ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం, కోర్టు క్రూరంగా వ్యవహరిస్తున్నాయని.. విద్యార్థుల ఆత్మహత్యలు తల్లిదండ్రులకు జీవితకాల శిక్షగా మారతాయని అన్నారు.

    ప్రజలంతా నీట్ పరీక్షను వ్యతిరేకించాలని సూర్య విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత #SURIYAagainstNEET హ్యాష్‌టాగ్ ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఆయనకు చాలా మంది సినీనటులు, నెటిజన్లు మద్దతు తెలిపారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Kollyood News, NEET 2020, Suriya, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు