ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం ఆ సూపర్ హిట్ సినిమాకు కాపీనా..

jr ntr trivikram | రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. పూర్తి పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం...

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: June 17, 2020, 6:29 AM IST
ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం ఆ సూపర్ హిట్ సినిమాకు కాపీనా..
ఎన్టీఆర్ త్రివిక్రమ్ Photo : Twitter
  • Share this:
రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రానికి ‘అయినను పోయిరావలే హస్తినకు’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్‌తో పోస్టర్లను కూడా రెడీ చేసి రిలీజ్ చేసారు ఎన్టీఆర్ అభిమానులు. పూర్తి పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఒకప్పటి చిరంజీవి నటించిన ఒక సూపర్ హిట్ సినిమా లైన్‌ను తీసుకొని ఇప్పటి జనరేషన్‌కు తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించబోతున్నట్టు త్రివిక్రమ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పూర్తి పొలిటికల్, ఫ్యామిలీ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం చిరంజీవి నటించిన ‘మంత్రిగారి వియ్యంకుడు’ సినిమా కాన్సెప్టును ప్రేరణగా తీసుకొని తెరకెక్కించబోతున్నట్టు చెబుతున్నారు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జయకృష్ణ నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్‌తోనే త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు తనదైన పొలిటికల్ టచ్‌తో కాస్త డిఫరెంట్‌గా తెరకెక్కించబోతున్నాడట. ఇక మంత్రిగారి వియ్యంకుడు సినిమాకు సంబంధించిన చిత్ర నిర్మాత, దర్శకుడు కూడా లేకపోవడం త్రివిక్రమ్‌కు కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి.

jr ntr trivikram latest movie ayinanu poyiravale hastinaku movie copy of chiranjeevi super hit movie,ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా చిరంజీవి సూపర్ హిట్ సినిమాకు కాపీనా,ntr trivikram chiranjeevi,NTR,ntr 30,ntr trivikram Mantri Gari Viyyankudu chiranjeevi,Mantri Gari Viyyankudu chiranjeevi ntr trivikram,trivikram ntr movie copy from Mantri Gari Viyyankudu,ntr trivikram political backdrop movie,Jr ntr balakrishna trivikram,jr ntr rashmika pooja hegde trivikram,ntr,jr ntr,rrr,rrr jr ntr,trivikram, ayinanu poyiraavale hasthinaku,ntr trivikram title ayinanu poyiraavale hasthinaku,ayinanu poyiravale hasthinaku,ntr trivikram ayinanu poyiravale hasthinaku,ala vaikunthapurramloo,Trivikarm to work with NTR for his next movie,jr ntr,jr ntr new movie,jr ntr movies,jr ntr upcoming movie,trivikram,trivikram movies,jr ntr new look for his next movie revealed,ntr movies,jr ntr and trivikram srinivas new movie,jr ntr and trivikram srinivas new movie confirm,trivikram srinivas with jr ntr,jr ntr trivikram srinivas movie,anirudh music for trivikram and jr ntr next movie,jr ntr hard work for his new makeover,త్రివిక్రమ్,ఎన్టీఆర్,అరవింద సమేత వీరరాఘవ,అయినను పోయిరావలె హస్తినకు,అయినను పోయిరావలె హస్తినకు ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ టైటిల్,రాజకీయ నేపథ్యంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా,పూజా హెగ్డే,రష్మిక మందన్న,మంత్రిగారి వియ్యంకుడు,మంత్రిగారి వియ్యంకుడు ఎన్టీఆర్ త్రివిక్రమ్,చిరంజీవి మంత్రిగారి వియ్యంకుడు సినిమా రీమేక్ ఎన్టీఆర్,త్రివిక్రమ్
మంత్రిగారి వియ్యంకుడు సినిమా ప్రేరణగా తెరకెక్కబోతున్న ఎన్టీఆర్,త్రివిక్రమ్ సినిమా (Twitter/Photo)


రీసెంట్‌గా త్రివిక్రమ్.. అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా కూడా అలనాటి ఎన్టీఆర్ ‘ఇంటి గుట్టు’, మంచి మనిషి  సినిమాల కాన్సెప్టునే ‘అల వైకుంఠపురములో’ సినిమా కోసం వాడుకున్నాడు.త్రివిక్రమ్ గత సినిమాల విషయానికొస్తే.. ‘అ..ఆ’ సినిమా కృష్ణ, విజయ నిర్మల హీరో, హీరోయిన్లుగా నటించిన ‘మీనా’ సినిమాను అనఫీషియల్ రీమేక్ చేసాడనే చెప్పాలి. మహేష్ బాబుతో చేసిన ‘అతడు’ సినిమా కూడా వెంకటేష్ ‘వారసుడొచ్చాడు’ సినిమాను అటు ఇటు కొంచెం మార్పులు చేసి తెరకెక్కించాడు. ఇక అల్లు అర్జున్ ‘జులాయి’ సినిమాలోని బ్యాంక్ దొంగతనం సీన్.. ’ది డార్క్ నైట్’ అనే ఫేమస్ హాలీవుడ్ సినిమాలోని సీన్లను యథాతదంగా వాడుకున్నాడు.

ala vaikunthapurramloo movie story inspired by sr ntr one of the super hit movie here are the details,Allu Arjun Ala Vaikuntapuramuloo inspired by Ntr Inti guttu,allu arjun,ala vaikunthapurramuloo,ala vaikuntapuramuloo,ala vaikuntapuramlo,ala vaikunthapurramuloo songs,allu arjun new movie,allu arjun new song,ala vaikuntapuram lo songs,ala vaikuntapuramlo songs,ramuloo ramulaa allu arjun,ala vaikuntapuram song,allu arjun songs,allu arjun alaa vaikuntapuramlo new song update,ala vaikuntapuram lo song,ala vaikunta puram lo songs,ala vaikuntapuram lo first song,ala vaikunthapuramulo,ala vaikunthapuramulo movie,ala vaikunthapuramulo shooting,allu arjun ala vaikunthapuramulo,ala vaikunthapuramulo dubbing work,ala vaikunthapuramulo sushanth dubbing started,ala vaikunthapuramulo movie shooting,ala vaikunthapuramulo allu arjun pooja hegde,ala vaikunthapuramulo trivikram srinivas,telugu cinema,అల్లు అర్జున్,అల వైకుంఠపురములో,అల వైకుంఠపురములో అల్లు అర్జున్ పూజా హెగ్డే,అల్లు అర్జున్ సుశాంత్,తెలుగు సినిమా,అల వైకుంఠపురములో డబ్బింగ్ మొదలు,అల వైకుంఠపురములో

అటు అత్తారింటికీ దారేదిలో బ్రహ్మి అబద్ధం చెబితే.. ఆకులు రాలే సీన్ ఉంటుంది గదా. ఆ కామెడీ సీన్ ని ‘ఏ థౌసండ్ వర్డ్స్’అనే సినిమా నుంచి ఆ సీన్ ను కాపీ పేస్ట్ చేసాడు. మొత్తంగా ప్రతి సినిమాలో ఏదో ఒక హైలెట్ సీన్‌ను కాపీ కొట్టి తన సినిమా స్క్రీన్ ప్లే కలిపేయడం త్రివిక్రమ్‌కు పెన్నుతో పెట్టిన విద్య. మొత్తానికి త్రివిక్రమ్ పాత కథలను ఇప్పటి జనరేషన్‌కు తగ్గట్టు తీయడం మంచి పరిణామనే చెప్పాలి. పాత సినిమాల కాన్సెప్ట్‌‌ను కొత్త సినిమా కోసం వాడుకోవడం అనేది ఒక్క త్రివిక్రమ్ మాత్రమే కాదు.. రాజమౌళి, పూరీ జగన్నాథ్ వంటి దర్శకులు కూడా తమ సినిమాల్లో ఎన్నో సీన్లను,కథలను వేరే సినిమాల నుంచి  కాపీ పేస్ట్ చేసినవారే. ఈ కాపీ పేస్ట్ అనే కంటే ప్రేరణ తీసుకొని తీసారని చెప్పుకోవచ్చు. ఈ సినిమాను త్రివిక్రమ్..  పూర్తి రాజకీయ నేపథ్యములో తెరకెక్కిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో చిత్రి యూనిట్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది. 
Published by: Kiran Kumar Thanjavur
First published: June 17, 2020, 6:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading