అరవింద సమేతంగా వీరరాఘవుడు ఎంత కలెక్ట్ చేయాలి

రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో ట్రేడ్ వర్గాలల్లో చాలా అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే అన్ని ఏరియాలు కలిపి ఈ మూవీ రూ.93 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

news18-telugu
Updated: October 8, 2018, 3:05 PM IST
అరవింద సమేతంగా వీరరాఘవుడు ఎంత కలెక్ట్ చేయాలి
అరవింద సమేత వీరరాఘవ
  • Share this:
‘జై లవకుశ’ మూవీ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’. తారక్, త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ఈ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నెల 11న రిలీజ్ కాబోతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే, ఈషా రెబ్బాలు హీరోయిన్స్‌గా నటించారు. జగపతి బాబు, నాగబాబు ఇంపార్టెంట్ రోల్స్‌లో నటించారు. తమన్ మ్యూజిన్ అందించిన ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ మూవీని భారీ ఎత్తున తెరకెక్కించాడు.

రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో ట్రేడ్ వర్గాలల్లో చాలా అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే అన్ని ఏరియాలు కలిపి ఈ మూవీ రూ.93 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీకి వన్ వీక్ ముందు రిలీజైన ‘నోటా’ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ‘అరవింద సమేత వీర రాఘవ’ మూవీకి లైన్ క్లియర్ అయింది. దసరా సెలవుల నేపథ్యంలో ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు. మరోవైపు ప్రీమియర్ షోల హడావుడి ఉండనే ఉంది.

అందుకు తగ్గట్టు ఈ మూవీ టికెట్ రేటును పెంచుకునే వెసులుబాటును కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం అధికారంగా జీవో పాస్ చేయనున్నట్టు సమాచారం. ఒక్క ఏపీలోనే రూ.35 కోట్ల బిజినెస్ చేసినట్టు సమాచారం. త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్ ఎఫెక్ట్  ‘అరవింద సమేత’ మూవీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌పై ఎలాంటి ఎఫెక్ట్ చూపెట్టలేకపోయింది. మరి ఈ మూవీతో ఎన్టీఆర్..తన సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేసి మరో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకుంటాడా ? లేదా అనేది తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వరకు వెయిట్  చేయాల్సిందే.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 8, 2018, 3:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading