Nithiin- NTR: నితిన్ మూవీపై ఎన్టీఆర్ ట్వీట్.. ఏమ‌న్నారో తెలుసా

ఎన్టీఆర్ నితిన్

Nithiin- NTR: సినిమాల విష‌యంలో పోటీ ఎలా ఉన్నా.. వ్య‌క్తిగ‌తంగా న‌టీన‌టుల మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. మిగిలిన ఇండ‌స్ట్రీల‌తో పోలిస్తే టాలీవుడ్‌లో దాదాపుగా హీరోలంద‌రూ క్లోజ్‌గా ఉంటారు. త‌ర‌చుగా క‌లుసుకోక‌పోయినా సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు మాత్రం తోటీ నటీన‌టుల‌పై స్పందిస్తుంటారు ఇక్క‌డి హీరోలు

  • Share this:
    Nithiin- NTR: సినిమాల విష‌యంలో పోటీ ఎలా ఉన్నా.. వ్య‌క్తిగ‌తంగా న‌టీన‌టుల మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. మిగిలిన ఇండ‌స్ట్రీల‌తో పోలిస్తే టాలీవుడ్‌లో దాదాపుగా హీరోలంద‌రూ క్లోజ్‌గా ఉంటారు. త‌ర‌చుగా క‌లుసుకోక‌పోయినా సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు మాత్రం తోటీ నటీన‌టుల‌పై స్పందిస్తుంటారు ఇక్క‌డి హీరోలు. ఇలా తాజాగా నితిన్ మూవీపై జూనియ‌ర్ ఎన్టీఆర్ స్పందించారు. చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ చెక్ అనే చిత్రంలో నటించిన విష‌యం తెలిసిందే. థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ రేపు(ఫిబ్ర‌వ‌రి 26న‌) ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇక ఈ మూవీపై నితిన్ అభిమానుల్లోనే కాదు.. సాధార‌ణ ప్రేక్ష‌కుల్లోనూ మంచి అంచ‌నాలు ఉన్నాయి.

    కాగా ఈ మూవీ రేపు విడుద‌ల కానున్న నేప‌థ్యంలో దీనిపై జూనియ‌ర్ ఎన్టీఆర్ స్పందించారు. చందు యేలేటి వినూత్న క‌థ‌లు, స్క్రీన్‌ప్లేకు ఎప్పుడూ అభిమానిని. చెక్ చాలా ఇంట్ర‌స్టింగ్‌గా అనిపిస్తోంది. రేపు చెక్ రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో చందు యేలేటికి, నితిన్‌కి, చెక్ టీమ్ మొత్తానికి బెస్ట్ విషెస్ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తూ.. థ్యాంక్స్‌. నువ్వు ఈ సినిమాను క‌చ్చితంగా ఎంజాయ్ చేస్తావు అని కామెంట్ పెట్టారు.



    కాగా థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన చెక్‌లో నితిన్ స‌ర‌స‌న వింక్ బ్యూటీ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ రొమాన్స్ చేశారు. ర‌కుల్ ప్రీత్ సింగ్, సాయి చంద్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే టీజ‌ర్, ట్రైల‌ర్‌తో ఆక‌ట్టుకున్న ఈ మూవీపై అంద‌రిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక గ‌తేడాది భీష్మ‌తో మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్న నితిన్‌.. చెక్‌తో ఆ విజ‌యాన్ని కంటిన్యూ చేస్తానన్న ధీమాలో ఉన్నాడు. మ‌రి చెక్ ఎలా ఉండ‌బోతుందో తెలియాలంటే మ‌రికొన్ని గంట‌లు ఆగాల్సిందే.
    Published by:Manjula S
    First published: