JR NTR WILL WORK WITH HOLLYWOOD DIRECTOR AFTER RRR TRIVIKRAM PRASHANTH NEEL MOVIES HERE ARE THE DETAILS TA
Jr NTR: ఆకాశమే హద్దుగా ఎన్టీఆర్ క్రేజ్.. హాలీవుడ్ దర్శకుడి చిత్రంలో తారక్.. ?
ఎన్టీఆర్ (Twitter/Photo)
Jr NTR: ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్) సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా తర్వాత తారక్.. వరుసగా త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్‌తో సినిమాలు చేయనున్నాడు. ఈ సినిమాల తర్వాత ఎన్టీఆర్ ఓ హాలీవుడ్ దర్శకుడి చిత్రంలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
Jr NTR: ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్) సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా తర్వాత తారక్.. వరుసగా త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్‌తో సినిమాలు చేయనున్నాడు. ఈ సినిమాల తర్వాత ఎన్టీఆర్ ఓ హాలీవుడ్ దర్శకుడి చిత్రంలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. ప్రెజెంట్.. జూనియర్ ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు దాదాపు రెండేళ్లు కేటాయించాడు. ఆర్ఆర్ఆర్ కారణంగా 2019,2020 కాలెండర్ ఇయర్లో ఎన్టీఆర్ ఏ సినిమా విడుదల కాలేదు. కెరీర్ మొదలుపెట్టి నప్పటి నుంచి వరుసగా రెండు కాలెండర్ ఇయర్స్‌లో ఎన్టీఆర్ సినిమా విడుదల కాకపోవడం ఇదే మొదటిసారి. ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల గ్యాప్‌ను ఎన్టీఆర్‌ను వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఫిల్ చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ కోసం రంగంలోకి దిగనున్నాడు. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని విలన్‌గా అనుకుంటున్నారు. దాదాపు విజయ్ సేతుపతే ఖాయం అయ్యే అవకాశాలున్నాయి.
ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ కూడా మరో కథానాయికుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుంటే.. రామ్ చరణ్ మాత్రం అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ విడుదల (Twitter/Photo)
ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్, చినబాబు కలిసి నిర్మిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్‌తో పాటు ‘చౌడప్ప నాయుడు’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. త్రివిక్రమ్ మూవీ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో సలార్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కంప్లీటయ్యే లోపు ఎన్టీఆర్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కంప్లీటయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఇప్పటి వరకు తెలుగు తెరపై రానీ డిఫరెంట్ సబ్జెక్ట్‌తో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇంకోవైపు ఎన్టీఆర్‌తో సినిమాలు చేయడానికి లోకేష్ కనగరాజ్,అట్లీ, సంజయ్ లీలా భన్సాలీ, వక్కంతం వంశీ, నాగ్ అశ్విన్ వంటి దర్శకులు లైన్లో ఉన్నారు.
ఎన్టీఆర్,త్రివిక్రమ్ (Twitter/Photo)
ఆ సంగతి పక్కన పెడితె.. ఎన్టీఆర్.. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు చిత్రంలో నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. హాలీవుడ్లో ‘అన్ బ్రేకబుల్’, ది సిక్స్త్ సెన్స్, గ్లాస్ వంటి సినిమాను తెరకెక్కించిన మనోజ్ నైట్ శ్యామలన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.