రామ్ చరణ్‌కు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్న ఎన్టీఆర్..

Ram Charan Birthday: మార్చ్ 27.. రామ్ చరణ్ పుట్టిన రోజు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బర్త్ డే వేడుకలు జరుపుకోవడం కష్టమే. అందుకే పది రోజుల ముందే తనకు ఈ వేడుకలు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 26, 2020, 7:41 PM IST
రామ్ చరణ్‌కు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్న ఎన్టీఆర్..
రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ (ram charan ntr)
  • Share this:
మార్చ్ 27.. రామ్ చరణ్ పుట్టిన రోజు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బర్త్ డే వేడుకలు జరుపుకోవడం కష్టమే. అందుకే పది రోజుల ముందే తనకు ఈ వేడుకలు వద్దని చెప్పేసాడు రామ్ చరణ్. పైగా ఇప్పుడు పరిస్థితులు కూడా బాగోలేవు. ఇంట్లో నుంచి అడుగు కూడా బయటపెట్టడానికి లేదు. దాంతో ఇంట్లోనే పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు చరణ్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయనకు జూనియర్ ఎన్టీఆర్. దిరిపోయే గిఫ్ట్ ప్లాన్ చేసాడు. ఈ ఇద్దరూ కలిసి రాజమౌళి RRR సినిమాలో నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ సోషల్ మీడియాతో పాటు యూ ట్యూబ్‌లో కూడా సంచలన రికార్డులు సృష్టిస్తుంది. ఈ సినిమాలో కొమరం భీంగా ఎన్టీఆర్.. అల్లూరిగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ స్పెషల్ వీడియోను జూనియర్ ఎన్టీఆర్ లాంఛ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన అప్ డేట్ కూడా వచ్చేసింది. మార్చ్ 27 ఉదయం 10 గంటలకు డిజిటల్ వరల్డ్‌లో సంచలనాలు సృష్టించడానికి రామరాజు వచ్చేస్తున్నాడు.


ఇదే విషయాన్ని జూనియర్ కూడా తెలిపాడు. బ్రదర్ నీ పుట్టిన రోజు వేడుకలు ప్రస్తుత పరిస్థితుల్లో ఘనంగా జరుపుకోలేం కానీ కచ్చితంగా నీవు జీవితంలో మరిచిపోలేని గిఫ్ట్ డిజిటల్ ప్లాట్ ఫామ్‌పై రేపు ఇస్తాను చూడు అంటూ ట్వీట్ చేసాడు ఎన్టీఆర్. ఇది చూసి అటు నందమూరి.. ఇటు మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. స్పెషల్ వీడియోను విడుదల చేస్తున్నాడు రాజమౌళి. మరి అది ఎలా ఉండబోతుందో చూడాలిక.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు