అవును ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. ఇప్పటికే తారక్.. ఆర్ఆర్ఆర్ పాత్రలో చారిత్రక యోధుడైన కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా తర్వాత మరో చారిత్రక పాత్ర చేయడానికి రెడీ అవుతున్నాడు.
అవును ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. ఇప్పటికే తారక్.. ఆర్ఆర్ఆర్ పాత్రలో చారిత్రక యోధుడైన కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆ పాత్రతో పాటు త్వరలో తన తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు పాత్రలో నటించడానికి సై అన్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే తెలుగులో అన్న ఎన్టీఆర్ బయోపిక్ పై ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో బాలయ్య..అన్నగారి పాత్రలో ఒదిగిపోయినా.. ఒకే పార్టుగా కాకుండా రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. మరోవైపు తమిళనాడును కనుసైగలతో శాసించిన జయలలిత జీవితంపై పలు బయోపిక్‌లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. అందులో కంగనా ముఖ్యపాత్రలో ఏ.ఎల్.విజయ్.. ‘తలైవి’ పేరుతో ఒక సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే చెన్నైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలో అరవింద్ స్వామి.. ఎంజీఆర్ పాత్రలో నటిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ (File Photo)
ఇక జయలలిత తెలుగులో అన్న ఎన్టీఆర్‌తో ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు.వెండితెరపై వారిద్దరి జోడికి మంచి క్రేజ్ ఉండేది. అందుకే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు తగినంత ప్రాధాన్యం ఉంది. ఇప్పటికే అన్నగారి పాత్రకోసం ముందుగా బాలకృష్ణను సంప్రదించారు చిత్ర యూనిట్. కానీ బాలకృష్ణ మరోసారి నాన్నగారి క్యారెక్టర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదని టాక్. అందుకే చిత్ర నిర్మాతలు జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసి ఈ పాత్ర చేయమని రిక్వెస్ట్ చేసారట. గతంలో జూనియర్ ఎన్టీఆర్‌కు మహానటి సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ చేయమని అశ్వినీదత్ రిక్వెస్ట్ చేసినా.. సున్నితంగా తిరస్కరించారు. అలాంటిది జయలలిత జీవితంపై తెరకెక్కుతోన్న ‘తలైవి’లో తాత గారి పాత్రలో నటిస్తారా అనేది చూడాలి. ఒకవేళ ‘మహానటి’లో నటించక చారిత్రక తప్పిదం చేసానని తారక్ భావిస్తే..‘తలైవి’ సినిమాలో తాతా క్యారెక్టర్ చేసి ఆయన ఋణం తీర్చుకుంటాడా లేదా అనేది చూడాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.