త్రివిక్రమ్ సినిమాలో పొలిటికల్ లీడర్ పాత్రలో ఎన్టీఆర్.. షూటింగ్ మొదలయ్యేది ఆ రోజే..

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది.

news18-telugu
Updated: June 11, 2020, 9:39 AM IST
త్రివిక్రమ్ సినిమాలో పొలిటికల్ లీడర్ పాత్రలో ఎన్టీఆర్.. షూటింగ్ మొదలయ్యేది ఆ రోజే..
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Jr NTR Trivikram)
  • Share this:
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా  మరో కథానాయికుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుంటే.. రామ్ చరణ్ మాత్రం అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్, చినబాబు కలిసి నిర్మిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలిస్తోంది చిత్రబృందం. టైటిల్‌ను బట్టి ఇది పూర్తి రాజకీయ నేపథ్యమున్న సినిమా అనే విషయం అర్థమవుతోంది. దేశం ఎదుర్కొంటున్న సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

jr ntr trivikram upcoming movie ayinanu poyiravale hastinaku fan made poster go viral on social media,ntr trivikram,#NTR,ntr trivikram political backdrop movie,Jr ntr balakrishna trivikram,jr ntr rashmika pooja hegde trivikram,ntr,jr ntr,rrr,rrr jr ntr,trivikram, ayinanu poyiraavale hasthinaku,ntr trivikram title ayinanu poyiraavale hasthinaku,ayinanu poyiravale hasthinaku,ntr trivikram ayinanu poyiravale hasthinaku,ala vaikunthapurramloo,Trivikarm to work with NTR for his next movie,jr ntr,jr ntr new movie,jr ntr movies,jr ntr upcoming movie,trivikram,trivikram movies,jr ntr new look for his next movie revealed,ntr movies,jr ntr and trivikram srinivas new movie,jr ntr and trivikram srinivas new movie confirm,trivikram srinivas with jr ntr,jr ntr trivikram srinivas movie,anirudh music for trivikram and jr ntr next movie,jr ntr hard work for his new makeover,త్రివిక్రమ్,ఎన్టీఆర్,అరవింద సమేత వీరరాఘవ,అయినను పోయిరావలె హస్తినకు,అయినను పోయిరావలె హస్తినకు ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ టైటిల్,రాజకీయ నేపథ్యంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా,పూజా హెగ్డే,రష్మిక మందన్న,
ఎన్టీఆర్, త్రివిక్రమ్ లేెటెస్ట్ మూవీ పోస్టర్ (Twitter/Photo)


ఈచిత్రంలో ఎన్టీఆర్ రాజకీయ నాయకుడి పాత్రలో అది కూడా ముఖ్యమంత్రిగా నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాను వచ్చే దసరా రోజున పూజా కార్యక్రమాలతో లాంచంనగా ప్రారంభించి.. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట త్రివిక్రమ్. పైగా రాజమౌళి లాంటి దర్శకుడితో చేసిన తర్వాత ఆ హీరో మళ్లీ వెంటనే హిట్ కొట్టడం అనేది చరిత్రలో లేదు. అందుకే దాన్ని మార్చి చరిత్ర తిరగ రాయాలని చూస్తున్నాడు త్రివిక్రమ్. తారక్ కోసం అదిరిపోయే కథ సిద్ధం చేసాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీటైనట్టు సమాచరాం. ఈ  చిత్రంలో  ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో యాక్ట్  చేయబోతున్నాడని తెలుస్తుంది. అంతకు ముందు అదుర్స్, శక్తి, ఆంధ్రావాల సినిమాల్లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసాడు. ఇక ‘జై లవకుశ’ సినిమాలో ఏకంగా మూడు పాత్రల్లో నట విశ్వరూపం చూపించాడు. అయితే  త్రివిక్రమ్ సినిమా మొత్తం  తారక్ డబుల్ రోల్‌లో కనిపిస్తాడా లేదంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందా అనేది మాత్రం సస్పెన్స్. మొత్తంగా దసరాకు ఈ సినిమాను ప్రారంభించి సమ్మర్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లోఉన్నారు. ఒకవేళ ‘ఆర్ఆర్ఆర్’ సమ్మర్‌లో విడుదలైతే.. ఈ సినిమాను తర్వాత మంచి టైమ్ చూసుకొని విడుదల చేసే అవకాశం ఉంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 11, 2020, 9:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading