Home /News /movies /

JR NTR WIFE LAKSHMI PRANATHI HOT COMMENTS ON JR NTR COOKING MASTHAN BIRYANI GOES VIRAL NR

JR NTR - Lakshmi Pranathi: సైడ్ బిజినెస్ చేద్దాం అంటున్న భార్య ప్రణతి.. కుదరదంటున్న ఎన్టీఆర్..?

JR NTR - Lakshmi Pranathi

JR NTR - Lakshmi Pranathi

JR NTR - Lakshmi Pranathi: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి అందరికీ తెలిసిందే. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఎన్టీఆర్ తనకంటూ సపరేట్

    JR NTR - Lakshmi Pranathi: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి అందరికీ తెలిసిందే. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఎన్టీఆర్ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. ఎన్నో సినిమాల్లో నటించిన ఎన్టీఆర్ మంచి సక్సెస్ ఫుల్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. సోషల్ మీడియాలోను యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు మంచి సందేశాలను ఇస్తుంటాడు ఎన్టీఆర్.

    ఇక ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బిజీగా ఉన్నా ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్వాతంత్ర యోధుడు కొమురంభీం పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అంతేకాకుండా ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి మరో సినిమా చేయనున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నాడట. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ వంట చేస్తే తన ఆవిడ ప్రణతి అమ్ముతుందట‌.

    అదేంటి అనుకుంటున్నారా? అదేనండి.. ఎన్టీఆర్ నటన మాత్రమే కాకుండా వంట చేయడంలోనూ బాగా ఆసక్తి చూపిస్తాడు. గతంలోనూ బిగ్ బాస్ సీజన్ 1కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎన్టీఆర్ హౌస్ మేట్స్ కోసం బిర్యానీ చేసిపెట్టాడు. అలానే అయన ఇంట్లోకి కూడా అప్పుడపుడు గరిట తిప్పుతుంటాడు. ఆయన వంట రుచి తన ఇంటికి గెస్ట్ లుగా వెళ్లిన వారే చెబుతారాని బయట టాక్. ఎన్టీఆర్ ఖాళీ సమయాల్లో సాంగ్స్ వింటూ వంట చేస్తాడని తన అన్న కళ్యాణ్ రామ్ చెబుతున్నాడు. అంతేకాకుండా ఇంట్లోనే బ్రెడ్ స్లైడ్స్ కూడా తయారు చేస్తాడట. ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కి ఫోన్ చేసి అన్నయ్య నేను వంట చేస్తున్న భోజనానికి వచ్చేయ్ అని కూడా పిలుస్తాడట.

    ఇక బిర్యాని కూడా బాగా చేస్తుంటాడని కళ్యాణ్ రామ్ తెలిపాడు‌. వేరే రుచికరమైన డిష్ లను కూడా ప్రిపేర్ చేస్తాడట. ఇక సినిమా షూటింగ్స్ లేనప్పుడు ఇలా వంట చేస్తూ సైడ్ బిజినెస్ లా హోటల్ పెడితే బాగుంటుంది కదా అంటూ ఆటపట్టిస్తూ ఉంటామని కళ్యాణ్ రామ్ తెలిపాడు. అంతేకాకుండా నువ్వు వంట చేసేయ్ సైడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దామాని అంటుంటాడట. ఎన్టీఆర్ కూడా నేను వంట చేస్తే మా ఆవిడ అమ్ముతుందట‌.. నువ్వు వంట చెయ్ పక్కనబెట్టి అమ్మేస్తాను అంటూ ప్రణతి కామెంట్స్ చేస్తుందట. ఇక ఎన్టీఆర్ తను వంట చేస్తే తను తినడానికి ఫ్రెండ్స్ కి పెట్టడానికి తప్ప అమ్మడానికి, బిజినెస్ చేయడానికి కాదు అంటూ ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Alia Bhatt, Bigg boss season 1, Cooking masthan biryani, Jr ntr, Lakshmi Pranathi, Masthan biryani, Rajamouli, Ram Charan, Ramaraju, RRR

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు