Home /News /movies /

JR NTR WAS BETRAYED BY RAJAMOULI DUE TO THIS REASONS HERE ARE THE DETAILS MK

జూనియర్ ఎన్టీఆర్ కు రాజమౌళి చేసిన ద్రోహం ఇదే...ఢీ మాస్టర్ షాకింగ్ కామెంట్స్

రామారావు, రాజమౌళి

రామారావు, రాజమౌళి

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదలైంది. కానీ ఎన్టీఆర్ విషయానికి వస్తే బర్త్ డే రోజు కనీసం లుక్ కూడా విడుదల చేయలేదు. దీంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

    సంచలన దర్శకుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న బంధం ఈ నాటిది కాదు. ఇద్దరు ఒకే సారి కెరీర్ స్టార్ట్ చేసి, ఇప్పుడు ముచ్చటగా నాలుగోసారి కలిసి పనిచేస్తున్నారు. స్టూడెంట్ నెంబర్ వన్ తో మొదలైన వీరి ప్రస్థానం, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ వరకూ చేరింది. కానీ త్రిపుల్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరో కాదు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. అయితే నిజానికి ఇదొక క్రేజీ కాంబినేషన్, గతంలో చిరంజీవి, బాలయ్య ఇద్దరి మధ్య కనిపించిన కోల్డ్ వార్ నడిచింది. ఇద్దరూ తెలుగు ఇండస్ట్రీలో చెరో క్యాంపు మెయిన్ టెయిన్ చేశారనే టాక్ ఉంది. అలాంటిది ఆ తర్వాతి జెనరేషన్ అయిన రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ కలిస్తే ఎలా ఉంటుంది...అనే దానిపై చర్చ జరిగింది. ఇంతలోనే సినిమా కూడా పట్టాలకెక్కగా, సినిమా టీజర్లు, కూడా సందడి చేస్తున్నాయి. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. సీనియర్ ఎన్టీఆర్ సమయంలో సినిమా ఇండస్ట్రీలో ఓ వర్గం పైచేయిగా ఉండేది. ఆ తర్వాత పరిస్థితి మారింది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ డామినేషన్ సినిమా ఇండస్ట్రీలో స్పష్టంగా కనిపిస్తోందని, సినిమా విమర్శకులు అంటున్న మాటే...అయితే ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే పెద్ద బడ్జెట్ సినిమాలు తీసే క్రౌడ్ పుల్లర్లు గా ఉన్నారు.

    అటు మెగా ఫ్యామిలీలో మాత్రం చిరంజీవి సహా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇలా మెగా లిస్టులో వీరంతా సంవత్సరానికి ఓ సినిమా చొప్పున చేసిన భారీ బడ్జెట్ సినిమాలన్నీ వీరి కాంపౌండ్ లోనే తిరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ మొత్తం మెగా ఫ్యామిలీ చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదలైంది. కానీ ఎన్టీఆర్ విషయానికి వస్తే బర్త్ డే రోజు కనీసం లుక్ కూడా విడుదల చేయలేదు. దీంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

    తాజాగా సీనియర్ కొరియోగ్రాఫర్, సంచలన యూట్యూబర్ రాకేష్ మాస్టర్ కూడా ఈ విషయంపై స్పందించారు. రాంచరణ్ విషయంలో రాజమౌళి దగ్గరుండి టీజర్ విడుదల చేయగా, జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం సీరియస్ గా తీసుకోలేదని, అందుకే టీజర్ విడుదల కాలేని విమర్శించాడు. మెగా ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యి టీజర్ విడుదల కాకుండా చేసిందని రాకేష్ మాస్టర్ విమర్శించారు. ఇదంతా బిజినెస్ అని...రాం చరణ్ వెంట మెగా ఫ్యామిలీ ఉందని, జూనియర్ ఎన్టీఆర్ వెనుక ఎవరు లేరని, కనీసం బాలయ్య కూడా లేరని విమర్శించారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: NTR30, Rajamouli, Rrr movie

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు