news18-telugu
Updated: December 17, 2019, 9:07 AM IST
జూనియర్ ఎన్టీఆర్ ఫైల్ ఫోటో (Source: Twitter)
ప్రస్తుతం ఎన్టీఆర్..రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం తారక్.. ఆర్ఆర్ఆర్ తప్ప మరో సినిమా ఆలోచించే పరిస్థితి లేదు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో పాటు రామ్ చరణ్ ఏ దర్శకుడితో నెక్ట్స్ మూవీ చేయాలనే దానిపై ఇప్పటికీ మిస్టరీలా ఉంది.ఎన్టీఆర్,రామ్ చరణ్ వంటి మాస్ హీరోలతో చేస్తోన్న భారీ మల్టీస్టారర్ పై ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన నటిస్తోన్న ఆలియా భట్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం ఎన్టీఆర్‌కు జంటగా నటిస్తోన్న హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్‌పై సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయట.

జూనియర్ ఎన్టీఆర్ అట్లీ ప్రశాంత్ నీల్
ముఖ్యంగా ఎన్టీఆర్..తన తర్వాతి సినిమాను ఏ దర్శకుడితో ఎటువంటి సబ్జెక్ట్‌తో చేస్తాడనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఎన్టీఆర్.. అట్లీ, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్, కొరటాల శివ సినిమాల కథలకు ఓకే చెప్పాడు. ఐతే.. ఎన్టీఆర్ మాత్రం ఆర్ఆర్ఆర్ కంప్లీట్ అయ్యే వరకు ఏ సినిమాను పట్టాలెక్కించకూడదని అనుకుంటున్నాడట. ఐతే.. ఆర్ఆర్ఆర్ మొత్తం షూటింగ్ పార్ట్ ఫిబ్రవరి వరకు కంప్లీట్ కావచ్చోని టాక్. ఆ తర్వాత ముందుగా త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడు. ఆ తర్వాత వీలును ఆయా దర్శకులతో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాడట. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ హ్యాంగోవర్ నుంచి బయట పడ్డాకా కానీ కొత్త సినిమాకు కమిట్ కావద్దనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
December 17, 2019, 9:07 AM IST