Home /News /movies /

JR NTR VERY RESPECTFUL BEHAVIOR WITH JABARDASTH COMEDIAN RAISING RAJU IN TRAFFIC POLICE ANNUAL CONFERENCE PK

Jr NTR - Raising Raju: వినయ విధేయ తారకరామ.. జబర్దస్త్ కమెడియన్‌తో ఎన్టీఆర్ ప్రవర్తన చూడండి..

ఎన్టీఆర్ కొత్త లుక్ (Twitter/Photo)

ఎన్టీఆర్ కొత్త లుక్ (Twitter/Photo)

Jr NTR - Raising Raju: వినడానికి చిత్రంగా అనిపిస్తుంది కదా.. కానీ ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే ప్రేక్షకులకు వినయ విధేయ తారకరామున్ని చూపించాడు యంగ్ టైగర్. పెద్దవాళ్లను గౌరవించాలి.. చిన్నప్పటి నుంచి ఇది అందరూ నేర్పిస్తుంటారు.

వినడానికి చిత్రంగా అనిపిస్తుంది కదా.. కానీ ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే ప్రేక్షకులకు వినయ విధేయ తారకరామున్ని చూపించాడు యంగ్ టైగర్. పెద్దవాళ్లను గౌరవించాలి.. చిన్నప్పటి నుంచి ఇది అందరూ నేర్పిస్తుంటారు. కానీ అందులో ఎంతమంది దీన్ని తూచా తప్పకుండా పాటిస్తుంటారు..? అందులో జూనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా ఉంటాడు. తనకంటే పెద్ద వాళ్లను గౌరవించడంలో ముందుంటాడు ఈయన. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వార్షికోత్సవ కాన్ఫరెన్స్‌కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చాడు. అక్కడికి వచ్చి ట్రాఫిక్ నిబంధనల గురించి.. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల గురించి చర్చించాడు. తనకు తోచిన సూచనలు ఇచ్చాడు తారక్. అయితే ఈ వేడుకలో చాలా మంది పాల్గొన్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా కొందరికి సన్మానం కూడా జరిగింది. అందులో జబర్దస్త్ కమెడియన్ రైజింగ్ రాజు కూడా ఉన్నాడు. హైపర్ ఆదితో కలిసి టీం లీడర్‌గా ఉన్నాడు ఈయన. ట్రాఫిక్ పోలీస్ కాన్ఫరెన్స్‌లో ఈయన కూడా ఉన్నాడు. అక్కడ తారక్ చేతుల మీదుగా శాలువా ప్రధానం జరిగింది. అయితే స్టేజీపైకి వచ్చీ రాగానే జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల మీద పడ్డాడు రైజింగ్ రాజు. దాంతో షాక్ అయిపోయాడు యంగ్ టైగర్. ఆయన కంటే వయసులో రెండింతలు పెద్ద వాడైన రాజు వచ్చి తన కాళ్లపై పడటంతో వారించాడు యంగ్ టైగర్.

వెంటనే అతన్ని పైకి లేపి.. మీరు పెద్ద వాళ్లు అలా చేయకూడదు అంటూ తిరిగి నమస్కారం పెట్టాడు. అతడితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు.. పలకరించాడు. ఎన్టీఆర్ ప్రవర్తన చూసి అక్కడున్న వాళ్లు కూడా సంతోషించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు ఎన్టీఆర్ పెద్ద వాళ్లకు ఎంత గౌరవం ఇస్తాడనేది అర్థమవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jr ntr, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు