ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్.. సోషల్ మీడియాలో వైరల్..

అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో త్రివిక్రమ్ మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు ఒక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేెటస్ట్‌ అప్‌డేట్‌ను అభిమానులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.

news18-telugu
Updated: February 24, 2020, 6:01 PM IST
ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్.. సోషల్ మీడియాలో వైరల్..
ఎన్టీఆర్ , త్రివిక్రమ్ Photo : Twitter
  • Share this:
అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో త్రివిక్రమ్ మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు ఒక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీకి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు రాయబారం సన్నివేశంలో పాండవులతో సంధి కుదరక పోయినా.. ‘అయినను పోయి రావాలె హస్తినకు’ అనే తిక్కన్న మహాభారతంలో వాడిన పదజాలం ఎంతో ప్రఖ్యాతి పొందింది. ఇపుడు అదే పదజలాన్ని త్రివిక్రమ్.. ఎన్టీఆర్ సినిమా కోసం వాడుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పోతన.. భాగవతంలో ఉన్న‘అల వైకుంఠపుమురములో’ అనే పద బంధం ఉంటుంది. ఈ  ‘అల వైకుంఠపుమురములో’ అనే పద బందన్నే త్రివిక్రమ్ తాజాగా తన  సినిమా కోసం వాడుకున్నాడు. అంతకు ముందు శ్రీ సీతారామ చంద్ర సమేత అనే పదానన్ి ‘అరవింద సమేత వీరరాఘవ’కు వాడకున్నాడు. ఈ రకంగా పురాణాలు, ఇతిహాసాల్లోని చక్కటి పద బంధాలను తెలుగు సినిమాలకు టైటిల్స్‌గా వాడుకుంటున్నాడు త్రివిక్రమ్.

jr ntr trivikram upcoming movie ayinanu poyiravale hastinaku fan made poster go viral on social media,ntr trivikram,#NTR,ntr trivikram political backdrop movie,Jr ntr balakrishna trivikram,jr ntr rashmika pooja hegde trivikram,ntr,jr ntr,rrr,rrr jr ntr,trivikram, ayinanu poyiraavale hasthinaku,ntr trivikram title ayinanu poyiraavale hasthinaku,ayinanu poyiravale hasthinaku,ntr trivikram ayinanu poyiravale hasthinaku,ala vaikunthapurramloo,Trivikarm to work with NTR for his next movie,jr ntr,jr ntr new movie,jr ntr movies,jr ntr upcoming movie,trivikram,trivikram movies,jr ntr new look for his next movie revealed,ntr movies,jr ntr and trivikram srinivas new movie,jr ntr and trivikram srinivas new movie confirm,trivikram srinivas with jr ntr,jr ntr trivikram srinivas movie,anirudh music for trivikram and jr ntr next movie,jr ntr hard work for his new makeover,త్రివిక్రమ్,ఎన్టీఆర్,అరవింద సమేత వీరరాఘవ,అయినను పోయిరావలె హస్తినకు,అయినను పోయిరావలె హస్తినకు ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ టైటిల్,రాజకీయ నేపథ్యంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా,పూజా హెగ్డే,రష్మిక మందన్న,
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ లేెటెస్ట్ మూవీ పోస్టర్ (Twitter/Photo)


తాజాగా ఎన్టీఆర్ సినిమా కోసం ‘అయినను పోయి రావలె హస్తినకు’ టైటిల్‌ను బట్టి ఇది పూర్తి రాజకీయ నేపథ్యమున్న సినిమా అనే విషయం అర్థమవుతోంది. అంతేకాదు ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న వర్ధమాన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు త్రివిక్రమ్ యాక్షన్, ఫ్యామిలీ, ఫాక్ష్యన్ చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించాడు. ఇపుడు ఎన్టీఆర్‌తో చేయబోతున్న ‘అయినను పోయి రావలె హస్తినకు’ సినిమాను పూర్తి రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ గతంలో ‘నాగ’ సినిమాలో కాలేజీ రాజకీయాల నేపథ్యంలో ఒక సినిమా చేసాడు. ఆ తర్వాత మళ్లీ రాజకీయ నేపథ్యమున్న సినిమా చేయలేదు. ఇపుడు త్రివిక్రమ్‌తో చేయబోతున్న సినిమాతో మరోసారి పొలిటికల్ నేపథ్యమున్న సినిమా చేయబోతున్నట్టు టైటిల్‌ను బట్టి చెప్పొచ్చు. మొత్తానికి వీళ్లిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమాను  సమ్మర్‌లో మొదలుపెట్టి.. వచ్చే సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్‌,ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

jr ntr trivikram upcoming movie ayinanu poyiravale hastinaku fan made poster go viral on social media,ntr trivikram,#NTR,ntr trivikram political backdrop movie,Jr ntr balakrishna trivikram,jr ntr rashmika pooja hegde trivikram,ntr,jr ntr,rrr,rrr jr ntr,trivikram, ayinanu poyiraavale hasthinaku,ntr trivikram title ayinanu poyiraavale hasthinaku,ayinanu poyiravale hasthinaku,ntr trivikram ayinanu poyiravale hasthinaku,ala vaikunthapurramloo,Trivikarm to work with NTR for his next movie,jr ntr,jr ntr new movie,jr ntr movies,jr ntr upcoming movie,trivikram,trivikram movies,jr ntr new look for his next movie revealed,ntr movies,jr ntr and trivikram srinivas new movie,jr ntr and trivikram srinivas new movie confirm,trivikram srinivas with jr ntr,jr ntr trivikram srinivas movie,anirudh music for trivikram and jr ntr next movie,jr ntr hard work for his new makeover,త్రివిక్రమ్,ఎన్టీఆర్,అరవింద సమేత వీరరాఘవ,అయినను పోయిరావలె హస్తినకు,అయినను పోయిరావలె హస్తినకు ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ టైటిల్,రాజకీయ నేపథ్యంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా,పూజా హెగ్డే,రష్మిక మందన్న,
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ లేెటెస్ట్ మూవీ పోస్టర్ (Twitter/Photo)




ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్గే లేదా రష్మిక మందన్నను అనుకుంటున్నారు. వీరిద్దిరిలో ఎవరు నటిస్తారో చూడాలి. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరవింద సమేత వీరరాఘవ’తో పాటు తాజాగా ‘అల వైకుంఠపురములో’ కూడా పూజానే హీరోయిన్‌గా నటించింది. అందుకే సెంటిమెంట్ ప్రకారం ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాలో మరోసారి పూజానే హీరోయిన్‌గా తీసుకుంటే బాగుంటుందని చెబుతున్నారు. మరోవైపు ఈ సినిమాలో సమంత అక్కినేని యాక్ట్ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ సినిమాలో బాలయ్యను కూడా నటింపజేయాలని ఆలోచిస్తున్నాడు మాటల మాంత్రికుడు. హీరో తండ్రిగా ఈయన కనిపిస్తే బాగుంటుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. పూర్తి కథ సిద్ధమైన తర్వాత బాలకృష్ణకు కథ చెప్పాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు అయితే వస్తున్నాయి. ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ ఒక నిర్మాత వ్యవహరిస్తున్నాడు కాబట్టి బాలయ్య యాక్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే ఎవరెన్ని చెప్పినా కూడా నందమూరి వారసులు కలిసి నటిస్తారా అనేది ప్రశ్నార్థకమే. ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్‌ షూటింగ్ తర్వాత  లాంఛనంగా ప్రారంభించి 2021 సమ్మర్‌‌లో రిలీజ్ చేసేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. మొత్తానికి ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమాపై పూటకో వార్త హల్‌చల్ చేస్తూనే ఉంది.
First published: February 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు