Jr NTR - Trivikram : త్రివిక్రమ్ పరువు తీసిన ఎన్టీఆర్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

NTR-Trivirkam:

Jr NTR - Trivikram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పరువు తీసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్. వివరాల్లోకి వెళితే.. 

  • Share this:
    Jr NTR - Trivikram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పరువు తీసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR). వివరాల్లోకి వెళితే.. అవును తారక్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ (Aravinda Sametha Veera Raghava) సినిమా ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఈ సినిమాలో ఎన్టీఆర్ .. వీరరాఘవ అనే ఫ్యాక్షనిస్ట్ పాత్రలో అదరగొట్టిన సంగ తెలిసిందే కదా. . అటు పూజా హెగ్డే..(Poouja Hegde) అరవింద పాత్రలో అలరించింది. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో మరో సినిమా అనౌన్స్ చేసారు. కానీ చివరకు ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. ఇక ఎన్టీఆర్ తన తర్వాత సినిమాను కొరటాల శివ(Koratala Siva) తో చేయనున్నట్టు ప్రకటించారు. అటు త్రివిక్రమ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను మహేష్ బాబు (Mahesh Babu)తో చేయనున్నట్టు ప్రకటించారు.

    ఇక త్రివిక్రమ్ ఏ హీరోతో సినిమా చేసినా.. తనదైన మార్క్ ఉండటం విశేషం. హీరోగా ఎవరున్న తనదైన పంచ్‌ డైలాగులతో ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేయడం త్రివిక్రమ్ శైలి. అంతేకాదు ఈయన సినిమాలు థియేటర్స్‌లో నడవకపోయినా.. టీవీల్లో మాత్రం సూపర్ హిట్ అవుతుంటాయి. అందుకు ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో పాటు అతడు (Athadu) సినిమాలు ఉదాహరణగా చెప్పొచ్చు. ఇందులో నువ్వు నాకు నచ్చావ్ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందించారు. ‘అతడు’ సినిమా థియేటర్‌లో జస్ట్ ఒకే అనిపించుకుంది. కానీ టీవీల్లో ప్రసారమైన ప్రతి సారి మంచి టీఆర్పీనే సాధించింది. ఇప్పటికే ఈ సినిమా టీవీల్లో వస్తే ఛానెల్ మార్చుకుండా చూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అటు ఖలేజా సినిమా డిజాస్టర్ అయినా.. టీవీల్లో మంచి టీఆర్పీనే సొంతం చేసుకోవడం విశేషం.

    Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

    కానీ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాకు జీ తెలుగులో ఎన్నో సార్లు ప్రసారమైంది. చాలాసార్లు ఈ సినిమా మంచి టీఆర్పీనే సాధించింది. ఈ సినిమాను త్రివిక్రమ్ తనదైన శైలిలో తెరకెక్కించిన ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అంశాలు కొద్దిగానే ఉన్నాయి. తాాజాగా ఈ సినిమా టీవీల్లో ప్రసారమయినపుడు ఈ సినిమా నగరాల్లో 2.05  రేటింగ్.. గ్రామీణ ప్రాంతాల్లో 1.67 రేటింగ్ సాధించింది. అయితే టీవీలతో పాటు ఓటీటీలో ఎక్కువ సార్లు ప్రసారం చేయడం వలన ఈ సినిమాకు అతి తక్కువ రేటింగ్ వచ్చి ఉంటుందని ఎన్టీఆర్ అభిమానులతో పాటు త్రివిక్రమ్ ఫ్యాన్స్ అంటున్నారు.

    Happy Birthday Suman : చిరంజీవి, బాలయ్యలకు ఆ విధంగా ముచ్చెమటలు పట్టించిన సుమన్..

    ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా ప్రసారమైన సమయంలో జెమిని టీవీలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా ప్రసారమైంది. ఈ మూవీకి నగరాల్లో 6.98 రేటింగ్ వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో 5.48 రేటింగ్ సాధించింది. మహర్షి మూవీతో పాటు డబ్బింగ్ సినిమాలు ‘బిచ్చగాడు’, ‘టెడ్డీ’ సినిమాలు ప్రసారమైనపుడల్ల మంచి రేటింగ్ దక్కించుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ‘అరవింద సమేత వీరరాఘవ’కు తక్కువ రేటింగ్ ఇపుడు ఇటు త్రివిక్రమ్, ఎన్టీఆర్ అభిమానుల్లో చర్చనీయాంశమైంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: