• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • JR NTR TRIVIKRAM MOVIE TITLE CHANGED AND THE LATEST TITLE GOING ROUNDS IN SOCIAL MEDIA PK

Jr NTR Trivikram: ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు కొత్త టైటిల్.. ‘అయిననూ పోయిరావలె’ కాదంట..

Jr NTR Trivikram: ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు కొత్త టైటిల్.. ‘అయిననూ పోయిరావలె’ కాదంట..

ఎన్టీఆర్,త్రివిక్రమ్ (Twitter/Photo)

Jr NTR Trivikram: జూనియర్ ఎన్టీఆర్‌తో ఇప్పటికే అరవింద సమేత లాంటి సినిమా చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. 2020లో అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చేసాడు. దాంతో ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో తారక్ కోసం..

  • Share this:
జూనియర్ ఎన్టీఆర్‌తో ఇప్పటికే అరవింద సమేత లాంటి సినిమా చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. 2020లో అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చేసాడు. దాంతో ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో తారక్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు మాటల మాంత్రికుడు. జనవరి 14న సంక్రాంతి కానుకగా సినిమా మొదలు కానుంది. ఇదే ఏడాది ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది. అన్నీ కుదిర్తే 2021 సమ్మర్‌లో షూటింగ్ మొదలు పెట్టి 2022 సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ముందు రాజమౌళి సినిమాను పూర్తి చేసిన తర్వాత త్రివిక్రమ్ సినిమాపై ఫోకస్ చేయబోతున్నాడు ఎన్టీఆర్. దాంతో కథను మరింత పకడ్బందీగా సిద్ధం చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ చిత్రంపై అంచనాలు కూడా ఆకాశంలోనే ఉన్నాయి. పైగా రాజమౌళి లాంటి దర్శకుడితో చేసిన తర్వాత ఆ హీరో మళ్లీ వెంటనే హిట్ కొట్టడం అనేది చరిత్రలో లేదు. అందుకే దాన్ని మార్చి చూపించాలని చూస్తున్నాడు త్రివిక్రమ్. తారక్ కోసం అదిరిపోయే కథ సిద్ధం చేస్తున్నాడు ఈయన. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ గురించి మరో షాకింగ్ అప్‌డేట్ బయటికి వచ్చింది. ఇన్ని రోజులు ఈ చిత్రానికి అయిననూ పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

jr ntr,jr ntr twitter,trivikram srinivas twitter,upendra villain jr ntr in trivikram movie,upendra jr ntr,ntr double role in trivikram movie,trivikram,trivikram about ntr,ntr trivikram movie,trivikram srinivas,aravinda sametha movie,jr ntr trivikram,ntr trivikram new movie,ntr fun with trivikram,jr ntr trivikram new movie,ntr 30 movie with trivikram,trivikram jr ntr next movie,trivikram srinivas about jr ntr,jr ntr and trivikram srinivas movie news,trivikram new movie,jr ntr and trivikram srinivas new movie updates,ntr and trivikram srinivas new movie release date,ఎన్టీఆర్ త్రివిక్రమ్,అయిననూ పోయిరావలె హస్తినకు త్రివిక్రమ్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఉపేంద్ర విలన్
ఎన్టీఆర్ , త్రివిక్రమ్ Photo : Twitter


ఇదే టైటిల్ కన్ఫర్మ్ అని కూడా వార్తలొచ్చాయి. పైగా త్రివిక్రమ్‌కు అ సెంటిమెంట్ కూడా ఉండటంతో ఇదే నిజమని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు టైటిల్ మారిపోయింది. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో సినిమా రానుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ ఈ స్క్రిప్ట్ సిద్ధం చేసాడని తెలుస్తుంది. అందుకే సినిమా టైటిల్ కూడా మార్చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనికి ‘అయిననూ పోయిరావలె’ కాకుండా చౌడప్ప నాయుడు అనే టైటిల్ వార్తల్లోకి వచ్చింది.

jr ntr,jr ntr twitter,trivikram srinivas twitter,upendra villain jr ntr in trivikram movie,upendra jr ntr,ntr double role in trivikram movie,trivikram,trivikram about ntr,ntr trivikram movie,trivikram srinivas,aravinda sametha movie,jr ntr trivikram,ntr trivikram new movie,ntr fun with trivikram,jr ntr trivikram new movie,ntr 30 movie with trivikram,trivikram jr ntr next movie,trivikram srinivas about jr ntr,jr ntr and trivikram srinivas movie news,trivikram new movie,jr ntr and trivikram srinivas new movie updates,ntr and trivikram srinivas new movie release date,ఎన్టీఆర్ త్రివిక్రమ్,అయిననూ పోయిరావలె హస్తినకు త్రివిక్రమ్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఉపేంద్ర విలన్
ఉపేంద్ర (Upendra)


ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ప్రతినాయక పాత్రలో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. మాటల మాంత్రికుడు చెప్పిన కథ నచ్చి ఉప్పీ దాదా కూడా నటించడానికి ఓకే అన్నట్లు తెలుస్తుంది. ఇందులో పవర్ ఫుల్ రాజకీయ నాయకుడిగా నటించనున్నాడు ఉపేంద్ర. మరోవైపు ఎన్టీఆర్ కూడా పొలిటికల్ లీడర్‌గానే కనిపించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అల వైకుంఠపురుములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత త్రివిక్రమ్ నుంచి రానున్న సినిమా కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. ఏదేమైనా కూడా త్రివిక్రమ్ లాంటి దర్శకుడు పొలిటికల్ సినిమా తీస్తే ఎలా ఉంటుందా అని చాలా రోజులుగా అభిమానులంతా ఆసక్తిగా చూస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: